అర్హులైన ప్రతి గిరిజ‌నుడికి సంక్షేమ ఫలాలు

అర్హులైన ప్రతి గిరిజ‌నుడికి సంక్షేమ ఫలాలు

ఉట్నూర్, ఆంధ్రప్రభ : ఉట్నూర్ గిరిజన అభివృద్ధి సంస్థ పరిధిలోని ప్రతి అర్హులైన గిరిజనులకు ప్రభుత్వ అభివృద్ధి, సంక్షేమ పథకాల ఫలాలు అందే విధంగా అధికారులు సమన్వయంతో కృషి చేయాలని అదిలాబాద్(Adilabad) జిల్లాఉట్నూర్ సమగ్ర గిరిజన అదిలాబాద్ జిల్లాఅభివృద్ధి సంస్థ నూతన ఇంచార్జ్, ప్రాజెక్టు నూతనఅధికారి యువరాజ్ మర్మాట్ అన్నారు.

ఉట్నూర్ సబ్ కలెక్టర్ గా విధులు నిర్వహిస్తున్న యువరాజ్ మర్మాట్ సమగ్ర గిరిజన అభివృద్ధి సంస్థ ప్రాజెక్టు అధికారిగా ఈ రోజు ఇంచార్జ్ బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా నూతన పిఓకు ఐటిడిఏ వివిధ శాఖల అధికారులు డిపిఆర్ఓ సంపత్ కుమార్(Sampath Kumar) పుష్ప గుచ్చాలు అందించి శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. గిరిజనుల సంక్షేమం కోసం ప్రభుత్వం అమలు చేస్తున్న అభివృద్ధి, సంక్షేమ పథకాలను అర్హత కలిగిన ప్రతి గిరిజనుడికి అందించేందుకు అధికారులు క్షేత్రస్థాయిలో పర్యటించాలని, అర్హులకు అందే విధంగా సమన్వయంతో కృషి చేయాలని తెలిపారు.

అర్హులైన గిరిజనుల(eligible tribals)కు ప్రభుత్వ సంక్షేమ పథకాలు అందించుటలో ముందుండాలని అన్నారు. కేంద్ర ప్రభుత్వం చేపట్టిన ప్రధానమంత్రి జన్ మన్(Prime Minister Jan Mann), ప్రధానమంత్రి జుగా ఇతర ఆదివాసి గిరిజన సంక్షేమ పథకాలను సమర్ధవంతంగా అమలు చేయాలని తెలిపారు.

గిరిజనులలో విద్యావంతులను అభివృద్ధి చేయాలని, ప్రభుత్వ పాఠశాలలలో సకల సదుపాయాలు కల్పించి నాణ్యమైన విద్య అందించాలని, గిరిజనుల ఆరోగ్యం పై ప్రత్యేక శ్రద్ధ వహిస్తూ సకాలంలో అవసరమైన వైద్య సేవలు అందించే విధంగా చర్యలు తీసుకోవాలని తెలిపారు. వ్యవసాయ రంగంలో రైతులకు అవసరమైన మెలకువలు అందించి అధిక దిగుబడి సాధించే విధంగా ప్రోత్సహించాలని పిఓ అన్నారు.

Leave a Reply