AP | దేశం మొత్తానికి విద్యుత్ స‌ర‌ఫ‌రా చేస్తాం : నారా లోకేశ్‌

అనంతపురం, ఆంధ్రప్రభ బ్యూరో ( రాయలసీమ) : మన నేలపై ఉత్పత్తయ్యే విద్యుత్‌ రాష్ట్రానికే కాకుండా.. భారతదేశానికి మొత్తం సరఫరా చేస్తామ‌ని మంత్రి నారా లోకేశ్‌ అన్నారు. ఈ సోలార్ ప్రాజెక్ట్ ద్వారా విద్యుత్‌ ఛార్జీలు తగ్గుతాయన్నారు. రెన్యువబుల్ ఎనర్జీ పరిశ్రమ మాత్రమే కాదు.. ఉద్యమం అని పేర్కొన్నారు. అనంతపురం జిల్లా గుత్తి మండలం బేతపల్లిలో రెన్యూ విద్యుత్‌ కాంప్లెక్స్‌కు నారా లోకేశ్‌ భూమిపూజ చేశారు. 2,300ఎకరాల్లో రూ.22వేల కోట్లతో దీనిని ఏర్పాటు చేస్తున్నారు. ఈ కార్యక్రమంలో రెన్యూ పవర్ చైర్మన్ సుమంత్ సిన్హా, గుంతకల్లు ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం, రెన్యూ సంస్థ సీఈఓ బలరాం మెహతా పాల్గొన్నారు. ఈసంద‌ర్భంగా లోకేష్ మాట్లాడుతూ… భారత క్లీన్ ఎనర్జీ విప్లవానికి శంకుస్థాపన చేశామ‌న్నారు. ఏపీ క్లీన్ ఎనర్జీ పాలసీకి అనుగుణంగా ప్జాజెక్ట్ రూపకల్పన చేశామని చెప్పారు. మేక్ ఇన్ ఇండియా ద్వారా రాష్ట్రానికి మరిన్ని పెట్టుబడులు తీసుకొస్తామన్నారు. త్వరలోనే కర్నూలుకు హైకోర్టు బెంచ్‌ తీసుకొస్తామని మంత్రి వెల్ల‌డించారు.

2030 నాటికి 500 జీడబ్ల్యూ నాన్-ఫాసిల్ ఇంధనమే లక్ష్యంగా పెట్టుకున్నామన్నారు లోకేష్. ఒకే రాష్ట్రం, ఒకే రాజధాని, అభివృద్ధి వికేంద్రీకరణే తమ నినాదమన్నారు. అనంతపురానికి కియా మోటార్ల పరిశ్రమ తెచ్చామని, మేక్ ఇన్ ఇండియా ద్వారా రాష్ట్రానికి మరిన్ని పెట్టుబడులు తీసుకొస్తామన్నారు. పీక్ అవర్స్‌‌లో గ్రిడ్ విశ్వసనీయతను పెంచడమే కాకుండా క్లీన్ ఎనర్జీలో ఏపీని నేషనల్ లీడర్‌గా నిలబెడుతుందని తెలిపారు. ఈ ప్రాజెక్టుతో ప్రత్యక్షంగా, పరోక్షంగా 1500 ఉద్యోగాలు రానున్నాయని మంత్రి నారా లోకేష్ వెల్లడించారు.

రాయలసీమ ప్రకాశం జిల్లాలో సోలార్ గ్రీన్ ఎనర్జీగా తీర్చిదిద్దుతామ‌న్నారు. ప్రధాని నరేంద్ర మోడీని కూడా రాయలసీమకు తీసుకొస్తామ‌న్నారు. ఎన్డీఏ కూటమి 11 నెలల్లోనే సంక్షేమ పథకాలతో పాటు అభివృద్ధిలో ముందుకు వెళుతున్నామ‌ని వెల్ల‌డించారు. ప్రజల ఆశీస్సులు ఉంటే రాష్ట్రాన్ని అన్ని రకాలుగా అభివృద్ధి చేసి చూపిస్తామ‌ని పేర్కొన్నారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం పునర్విభజన చేసిన తర్వాత రాజధాని ఎక్కడో తెలియద‌ని అంటూ, ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఒకే రాష్ట్రం, ఒకే రాజధాని అమరావతిగా తీర్చిదిద్దుతున్నారు. 2019 నుంచి 24 వరకు వైసీపీ ప్రభుత్వం సర్వనాశనం చేశారు’ అని మంత్రి విమ‌ర్శించారు.

Leave a Reply