అండగా ఉంటాం.. ఎల్ఓసీ అందజేత…
మక్తల్, ఆంధ్రప్రభ : నర్వ మండలం పాతర్చేడు గ్రామానికి చెందిన కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు గురు నరసప్ప అనారోగ్యంతో బాధపడుతున్న సందర్భంగా వైద్య ఖర్చుల నిమిత్తం రూ.5 లక్షల ఎల్ఓసి కాపీని తెలంగాణ రాష్ట్ర పశుసంవర్ధక మత్స్యకార, పాడిపరిశ్రమ, క్రీడా యువజన సర్వీసుల శాఖ మంత్రి డాక్టర్ వాకిటి శ్రీహరి(Dr. Vakiti Srihari) బాదిత కుటుంబ సభ్యులకు అందజేశారు. ఈ రోజు హైదరాబాద్ లోని మంత్రి క్వార్టర్స్ లో ఎల్ఓసి అందజేసి అండగా ఉంటామని మంత్రి కుటుంబ సభ్యులకు భరోసానిచ్చారు.
ఈ కార్యక్రమంలో మండల కాంగ్రెస్ అధ్యక్షుడు చెన్నయ్య సాగర్, గ్రామ అధ్యక్షుడు లంకాల మహేష్, జిల్లా నాయకుడు బొలుబండ వెంకటేష్, నాయకులు వెంకటయ్య, రాములు, శ్రీనివాసులు గౌడ్, బాలరాజ్, జికె.నరసింహులు, కొండన్న, మన్యం, ఏర్పుల ఆంజనేయులు, వై.వెంకటేష్, కమ్మరి శ్రీను, పసుల నరసింహులు, మెకానిక్ రాము, రాఘవేందర్ గౌడ్, టి. రాము, సంజీవ, వెంకట్ తదితరులు పాల్గొన్నారు.

