TG | సాయంత్రంలోగా చంపేస్తాం… రఘునందన్ రావుకు బెదిరింపు కాల్!


మెదక్ : పార్లమెంట్ సభ్యుడు, బీజేపీ నేత రఘునందన్ రావు (Raghunandan Rao) కు సోమవారం బెదిరింపు కాల్ (Threatening call) రావడం సంచలనం కలిగించింది. మావోయిస్టుల పేరుతో ఒక గుర్తుతెలియని వ్యక్తి ఫోన్ చేసి, ఆయన్ను అదే రోజు సాయంత్రంలోగా హతమారుస్తామని హెచ్చరించాడు. ఈ ఘటనపై రఘునందన్ రావు రాష్ట్ర పోలీసు డైరెక్టర్ జనరల్ (డీజీపీ), మెదక్ ఎస్పీతో సహా ఇతర ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేశారు.

రఘునందన్ రావు సోమవారం మేడ్చల్ జిల్లా దమ్మాయిగూడ Dammaiguda) లోని ఒక పాఠశాలలో జరుగుతున్న కార్యక్రమంలో పాల్గొన్నారు. ఆ సమయంలోనే ఆయనకు బెదిరింపు కాల్ వచ్చింది. మధ్యప్రదేశ్ నుంచి ఫోన్ చేస్తున్నానని, మావోయిస్టునని పరిచయం చేసుకున్న ఆ వ్యక్తి, రఘునందన్ రావును సాయంత్రంలోగా చంపేస్తామని బెదిరించాడు.

Leave a Reply