కర్నూలు బ్యూరో, జులై 29, ఆంధ్రప్రభ : చిన్న సమస్యలే పెద్ద యుద్దానికి దారి తీస్తాయని, అదేవిధంగా చిన్న మార్పులతో పెద్ద విజయాలు సాధిస్తామని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు పీవీఎన్.మాధవ్ (PVN.Madhav) అన్నారు. కర్నూలు జిల్లా పర్యటన (Kurnool district tour) లో ఆయన పాల్గొన్నారు. నగరంలోని స్టేడియం వద్ద వాకర్స్ తో ఛాయ్ పే చర్చ (Chai Pe Charcha with Walkers) నిర్వహించారు. స్థానికులు మాధవ్ తో కలిసి టీ తాగుతూ అనేక సమస్యలు ఆయన దృష్టికి తీసుకుని వచ్చారు. దేశ ప్రధానమంత్రి నరేంద్రమోదీ (Prime Minister Narendra Modi) ఆధ్వర్యంలో దేశంలోని అన్ని సమస్యలు పరిష్కారమవుతాయని తెలిపారు. బీజేపీ బలోపేతానికి చిన్న చిన్న మార్పులతో ఇలాంటి కార్యక్రమాలు చేస్తున్నామని మాధవ్ తెలిపారు. రాష్ట్రంలో బీజేపీ (BJP) ని బలోపేతం చేయడమే లక్ష్యంగా అడుగులు వేస్తున్నామని తెలిపారు.
ఈకార్యక్రమంలో ఆదోని బీజేపీ ఎమ్మెల్యే పార్థసారథి, బీజేపీ జిల్లా అధ్యక్షుడు రామకృష్ణ పాల్గొన్నారు. కార్యక్రమం అనంతరం కర్నూల్ నగరంలోని ఏ క్యాంపులో గల ఉయ్యాలవాడ నరసింహారెడ్డి విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం అక్కడి నుంచి ఆయన కర్నూలు మున్సిపల్ గ్రౌండ్ కు చేరుకున్నారు. అక్కడ నేతలు, కార్యకర్తలు ఆయనను సాధారణంగా ఆహ్వానించారు. అనంతరం అక్కడి నుంచి బీజేపీ కార్యకర్తలు నేతలతో కలిసి ర్యాలీగా స్థానిక మౌర్య ఇన్ కు చేరుకున్నారు. అనంతరం పరిణయ హాల్లో బీజేపీ కార్యకర్తల సమావేశంలో ఆయన పాల్గొన్నారు.