బీసీ రిజర్వేషన్‌లకు కట్టుబడి ఉన్నాం
- బీసీ రిజర్వేషన్‌లు ఆపటంలో అసలైన ముద్దాయి బీజేపీ
- బీసీలకు నోటి దాకా వచ్చిన ఫలాలను అడ్డుకున్నారు
- ఆర్ ఓ బీ నిర్మాణాల కోసం కేంద్రం నుండి నిధులు రావాల్సి ఉంది
- మీడియా చిట్ చాట్‌లో టీపీసీసీ చీఫ్, ఎమ్మెల్సీ బొమ్మ మహేష్ కుమార్ గౌడ్
నిజామాబాద్, ఆంధ్రప్రభ : బీసీలకు 42 శాతం రిజర్వేషన్‌కు కాంగ్రెస్ పార్టీ తరుపున కట్టుబడి ఉన్నామని, సుప్రీంకోర్టు(Supreme Court)కు వెళ్లి అప్పీలు చేసేందుకు సిద్ధంగా ఉన్నామని అక్కడ వెసులు బాటు దొరుకుతుందని ఆశిస్తున్నామని టీపీసీసీ చీఫ్, ఎమ్మెల్సీ బొమ్మ మహేష్ కుమార్ గౌడ్ అన్నారు. ఈ రోజు నిజామాబాద్(Nizamabad) జిల్లా కేంద్రంలోని అర్ అండ్ బీ గెస్ట్ హౌస్‌లో మీడియాతో చిట్ చాట్ నిర్వహించారు.
రిజర్వేషన్‌లు ఆపటంలో అసలైన ముద్దాయి బిజెపి అని, బీజేపీ, బీఆర్ ఎస్(BJP, BRS) కలిసి బీసీ రిజర్వేషన్ల ను అడ్డుకునే ప్రయత్నం చేస్తున్నారన్నారు. అందుకే గవర్నర్ దగ్గర బిల్లు పెండింగ్(pending)లో ఉంచారన్నారు. గవర్నర్‌ను నియమించేది మీరు అయితే, కావాలని బిల్లు పెండింగ్‌లో ఉంచింది మీరే అన్నారు. అన్ని బీజేపీ వద్ద ఉండగా కావాలని మూడు చట్టాలు ఒక ఆర్డినెన్సు గవర్నర్ వద్ద పెండింగ్ లో ఉన్నాయన్నారు. బీసీలకు నోటి దాకా వచ్చిన ఫలాలను అడ్డుకున్నారని, బీసీల ఉసురు తగులుతుందన్నారు.
బీసీ రిజర్వేషన్ పై కాంగ్రెస్ కు చిత్తశుద్ధి ఉందని ఈ సందర్భంగా గుర్తు చేశారు. మోడీ బీసీ ప్రధాని అని చెప్పుకునే బీజేపీ నేతలు బీసీ రిజర్వేషన్(reservation) బిల్లుపై ఎందుకు ఒత్తిడి తీసుకురావటం లేదన్నారు. బనకచర్ల విషయంలో చేయాల్సింది అంత చేసారు. బీ ఆర్ ఎస్ ఉదాసీనత వల్ల జీవో ఇచ్చారన్నారు. కాంగ్రెస్ వచ్చాకా అడ్డుకునేందుకు పిర్యాదు చేసింది మేమే అన్నారు. తేలంగాణ కు దక్కాల్సిన ఒక్క నీటి చుక్కను కొదులుకోమన్నారు.
మంత్రుల మధ్య విభేదాలు అన్నిసర్దుబాటు చేసుకుంటామని, ఆర్ ఓ బీ నిర్మాణాలకోసం కేంద్రం నుండి నిధులు రావాల్సి ఉందని అన్నారు. కేంద్రం నిధులు రాకపోవటం వల్ల పనులు ఆలస్యం అవుతున్నాయన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా అద్యక్షుడు మానాల మోహన్ రెడ్డి(Manala Mohan Reddy), రాష్ట్ర రైతు కమిషన్ సభ్యుడు గడుగు గంగాధర్, మాజీ ఎమ్మెల్సీ ఆర్కల నర్సారెడ్డి, పీసీసీ డెలిగేట్ శేఖర్ గౌడ్, సీనియర్ నాయకులు నాగేష్ రెడ్డి, నరాల రత్నాకర్ పాల్గొన్నారు.
