నేటి సాయంత్రం నీరు విడుదల
ఉమ్మడి కరీంనగర్ బ్యూరో, ఆంధ్రప్రభ : దిగువ మానేరు (ఎల్ఎండీ) జలాశయం(Reservoir) పూర్తిగా నిండింది. దీంతో అధికారులు అప్రమత్తమై ఈ రోజు సాయంత్రం నీరు విడుదల చేయనున్నారు. సాయంత్రం నాలుగు గంటలకు స్థానిక ఎమ్మెల్యే(MLA) కవ్వంపల్లి సత్యనారాయణ నీటిని విడుదల చేయనున్నారు.
మానేరు జలాశయం సామర్థ్యం 24 టీఎంసీలు(24 TMC) కాగా ఇటీవల వర్షాలకు శ్రీరాంసాగర్, మిడ్ మనేరు నుండి ఎల్ ఎం డీ కి భారీగా వరద వచ్చింది. దీంతో దాదాపు 24 టీఎంసీలకు నీటి సామర్థ్యం(water capacity) చేరుకుంది. ఒక వైపు సాగు నీరు( irrigation water), మరో వైపు దిగువకు నీరును విడుదల చేయనున్నారు.

