WATER PLANT | శుద్ధజల కేంద్రం ప్రారంభం

WATER PLANT | శుద్ధజల కేంద్రం ప్రారంభం

  • ప్రజల ఆరోగ్య రక్షణలో పారిశ్రామిక సంస్థల పాత్ర అభినందనీయం
  • ఎమ్మెల్యే బొజ్జల సుధీర్ రెడ్డి

WATER PLANT | ఏర్పేడు, ఆంధ్రప్రభ : గ్రామీణ ప్రాంత ప్రజల ఆరోగ్య పరిరక్షణకు శుద్ధమైన తాగునీరు ఎంతో అవసరమని, ఈ దిశగా పారిశ్రామిక సంస్థలు సామాజిక బాధ్యతతో ముందుకు రావడం శుభపరిణామమని శ్రీకాళహస్తి శాసనసభ్యులు బొజ్జల వెంకట సుధీర్ రెడ్డి అన్నారు. ఏర్పేడు మండలం కందాడ పంచాయతీ పరిధిలోని కుక్కలవారి కండ్రిగ గ్రామంలో విష్ణు బేరియం ప్రైవేట్ లిమిటెడ్ వారి ఆర్థిక సహకారంతో నిర్మించిన శుద్ధ జల కేంద్రాన్ని (మినరల్ వాటర్ ప్లాంట్) ఈ రోజు ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి ముఖ్య అతిథిగా విచ్చేసి ప్రారంభించారు. ఈ కార్యక్రమం ఏర్పేడు మండల తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు పేరం నాగరాజ నాయుడు అధ్యక్షతన జరిగింది.

​ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సభలో ఎమ్మెల్యే మాట్లాడుతూ… ప్రతి ఒక్కరూ ఆరోగ్యకరమైన జీవనం సాగించాలంటే కలుషితం లేని నీరు తాగ‌డం ఆవశ్యకమని అన్నారు. గ్రామస్తుల తాగునీటి కష్టాలను గుర్తించి విష్ణు బేరియం సంస్థ తమవంతు సాయంగా శుద్ధ జల కేంద్రాన్ని ఏర్పాటు చేయడం అభినందనీయమన్నారు. ఇతర సంస్థలు కూడా ఇటువంటి సేవా కార్యక్రమాల్లో భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు. గ్రామస్తులు ఈ పథకం సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ​

ఈ కార్యక్రమంలో సీనియర్ నాయకులు పేరం ధనంజయులు నాయుడు, కందటి శివశంకర్ రెడ్డి, సూరినాయుడు, మోహన్ నాయరాయ, మండల తెలుగు యువత అధ్యక్షుడు పూల హేమాక్షి రాయల్, బాబు నాయుడు, కేశినేని సుబ్రహ్మణ్యం, రవినాయుడు, సీతాపతి ఆచారి, క్రిష్ణప్ప మొదలియర్, రాఘవేంద్ర, రాచేటి సుబ్రహ్మణ్యం, గుణాయాదవ్, కేకే రమణ, చిరంజీవులు నాయుడు, ఆర్‌ఎంపీ మునెయ్య, భూపతి నాయుడు, చంద్రశేఖర్ నాయుడు, అశ్వద్దామ, హంస, మనోజ్, తేజ, మునెయ్య, బాలాజీ, బాబునాయుడు, ఏర్పేడు మండలానికి చెందిన తెలుగుదేశం పార్టీ, కూటమి నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు.

Leave a Reply