Water dispute | కేంద్ర‌మంత్రి పాటిల్ స‌మ‌క్షంలో చంద్ర‌బాబు, రేవంత్ భేటి – 10 అంశాలపై కొనసాగుతున్న చర్చలు

జ‌ల‌వివాదాల‌పై ఇద్ద‌రు సిఎంల‌తో పాటిల్ చ‌ర్చ‌లు
గోదావ‌రి ,కృష్ణా నీటి కేటాయింపుల‌పై తెలంగాణ ప‌ట్టు
మిగుల జ‌లాల అంశాల‌పై ఎపి ప్ర‌త్యేక దృష్టి
ఢిల్లీలో కొన‌సాగుతున్న చ‌ర్చ‌లు

న్యూ ఢిల్లీ – ఎపి, తెలంగాణ‌ల (AP, Telangana ( మ‌ధ్య జ‌ల వివాదాల (water dispute ) నేప‌థ్యంలో బుధ‌వారం మధ్యాహ్నం ఢిల్లీలోని (delhi ) కేంద్ర జలశక్తి శాఖ కార్యాలయంలో కేంద్ర మంత్రి సీఆర్ పాటిల్ (Central minister CR patil ) అధ్యక్షతన ఏపీ, తెలంగాణ రాష్ట్రాల మధ్య కీలక సమావేశం (Meeting ) ప్రారంభ‌మైంది. ఇందులో ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు , తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పాల్గొన్నారు, ఆయా రాష్ట్రాల నీటి పారుదల మంత్రులు నిమ్మల రామానాయుడు, ఉత్తమ్ కుమార్ రెడ్డితోపాటు ఉన్నతాధికారులు పాల్గొన్నారు.. ఈ భేటీ ఇరు రాష్ట్రాల మధ్య ఉన్న పాత వివాదాల పరిష్కారానికి కేంద్రం తీసుకుంటున్న తాజా ప్రయత్నంగా ప‌రిశీల‌కులు భావిస్తున్నారు. ముఖ్యంగా కృష్ణా, గోదావ‌రి జలాల కేటాయింపుల‌పై తెలంగాణ ప్ర‌భుత్వం ముఖ్యంగా కేంద్ర మంత్రి దృష్టికి తెచ్చిన‌ట్లు స‌మాచారం.. విభ‌జ‌న ముందునాటి కేటాయింపుల‌పై అభ్యంత‌రం చెప్పారు తెలంగాణ అధికారులు. మొత్తం 10 అంశాలనై చర్చలు కొనసాగుతున్నట్లు సమాచారం

రాయలసీమకు జీవనం బనకచర్ల ప్రాజెక్టు

ఇక ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రతిపాదించిన గోదావరి – బనకచర్ల లింక్ ప్రాజెక్టుతో సముద్రంలో వృథాగా పోతున్న 200 టీఎంసీల గోదావరి వరద నీటిని కర్నూలు జిల్లా బనకచర్ల వరకు తరలించాలన్నది ప్ర‌ధాన ఉద్దేశ్యం. ఈ ప్రాజెక్టుతో 80 లక్షల మందికి తాగునీరు, 3 లక్షల హెక్టార్లకు సాగునీరు అందుతుందని ఏపీ వాదిస్తోంది. ముఖ్యంగా రాయలసీమ ప్రాంతానికి ఇది వెలుగుల బాటగా ఉంటుందని సీఎం చంద్రబాబు స్పష్టంగా చెప్పారు. కేంద్ర సహకారం అందితే తాము వెంటనే పనులు ప్రారంభించేందుకు సిద్ధమని ప్రకటించారు. కాగా, ఈ ప్రాజెక్టుకు అనుమ‌తులు లేవ‌ని, అస‌లు ఈ విష‌యంలో చ‌ర్చ‌క్కూడా ఓప్పుకోబోమ‌ని తెలంగాణ ప్ర‌భుత్వం స్ప‌ష్టం చేసింది.. అయిన‌ప్ప‌టికే ఎపి ప్ర‌భుత్వం మిగులు జ‌లాల అంశాన్ని కేంద్ర మంత్రి దృష్టికి తెచ్చినట్లు స‌మాచారం.

Leave a Reply