THE POND| డీకే పల్లి చెరువుకు జల హారతి..

THE POND| డీకే పల్లి చెరువుకు జల హారతి..
THE POND| కుప్పం, ఆంధ్రప్రభ : రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుకు కుప్పం నియోజకవర్గ ప్రజల తరుఫున ధన్యవాదములు తెలిపాలని.. నియోజకవర్గంలో కొన్ని చెరువులకు హంద్రీ నీవా సుజాల స్రవంతి కాలువ ద్వారా కృష్ణ నది జలాలను తీసుకువచ్చినందుకు ప్రజలు హార్షం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ప్రజలు నారా భువనేశ్వరికి ఘన స్వాగతం పలికి ప్లే కార్డులు ప్రదర్శించారు. కుప్పం మున్సిపాలిటీ పరిధిలోని డీకే పల్లికి చెరువు నిండి నీరు ప్రవహిస్తున్న తరుణంలో చెరువుకు నారా భువనేశ్వరి జలహారతి ఇచ్చి.. శ్రీ ప్రసన్న చౌడేశ్వరమ్మ దేవాలయాన్ని సందర్శించి ప్రత్యేక పూజలు చేశారు. చెరువు వద్ద ‘మా మాటగా చెప్పు భువనమ్మ’ ప్లే కార్డులతో కుప్పం మహిళలు స్వాగతం పలికారు.
అనంతరం హంద్రినీవా ద్వారా కుప్పానికి కృష్ణా జలాలు తరలింపుపై సీఎం చంద్రబాబుకు కృతజ్ఞత తెలిపారు. కుప్పం పర్యటనలో భాగంగా రెండో రోజు శాంతిపురం నివాసంలో గ్రీవెన్స్ నిర్వహించిన నారా భువనేశ్వరి స్థానిక ప్రజల నుంచి అర్జీలు స్వీకరించి సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని హామీ ఇచ్చారు. నియోజకవర్గ నాయకులు, కార్యకర్తలు నారా భువనేశ్వరిను వారి స్వగృహం వద్ద మర్యాద పూర్వకంగా కలిశారు. వారికి కుప్పం ప్రజలకు ఎల్లవేళలా అండగా ఉంటామని భరోసా ఇచ్చారు. అదేవిధంగా కుప్పం నియోజకవర్గం స్థాయిలో స్వచ్ఛ భారత్ అవార్డులు గెలుచుకున్న ఢిల్లీ పబ్లిక్ స్కూల్ విద్యార్థులను నారా భువనేశ్వరి అభినందించారు.

దయాళ్ శ్రవణ్ ఫౌండేషన్ స్పాన్సర్ చేసిన వినికిడి పరికరాలఆమె పంపిణీ చేశారు. కుప్పం రెండో రోజు పర్యటనలో భాగంగా ముఖ్యమంత్రి స్వగృహమైన శివపురంలో గురువారం గ్రీవెన్స్ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రజల సమస్యలను తెలుసుకున్నారు. స్వగృహాన్ని సందర్శించిన ప్రజలతో ఆప్యాయంగా మాట్లాడుతూ, వారి వినతులను స్వీకరించారు. సమస్యల పరిష్కారాన్ని ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్తామని వారికి హామీ ఇచ్చారు. అలాగే వారిని ఆప్యాయంగా పలకరిస్తూ, వారితో కలిసి ఫోటోలు దిగారు.
