హైదరాబాద్‌కు హెచ్చరిక…

మొంథా తుఫాన్ ప్ర‌భావంతో మరో రెండు గంటల్లో నగరంలో మోస్తరు నుంచి భారీ వర్షాలు పడే అవకాశం ఉందని భారత వాతావరణశాఖ (IMD) వెల్లడించింది. తెలంగాణ రాష్ట్రంపై తదుపరి 12–18 గంటల్లో తుఫాన్ ప్రభావం కొనసాగనుందని అధికారులు తెలిపారు. ప్రజలు అప్రమత్తంగా ఉండి, అధికారులు ఇచ్చిన సూచనలను ఖచ్చితంగా పాటించాలని విజ్ఞప్తి చేశారు.

రాత్రి 1–2 గంటల తర్వాత హైద‌రాబ‌ద్ న‌గరంలో వర్షాలు క్రమంగా పెరగనున్నాయి. తెల్లవారుజాము వరకు నిరంతరాయంగా మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉంద‌ని, కొన్ని ప్రాంతాల్లో అర్ధరాత్రి నుంచి తెల్లవారుజాము మధ్య భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని ఐఎండీ తెలిపింది.

ప్రజలు అనవసర ప్రయాణాలు చేయరాదని, వాతావరణశాఖ విడుదల చేసే తాజా బులెటిన్లను గమనించాలని అధికారులు సూచించారు.

Leave a Reply