అందుబాటులో ఉంటా.. ఆశీర్వదించండి..

అందుబాటులో ఉంటా.. ఆశీర్వదించండి..

  • వార్డు సమస్యల పై కౌన్సిల్ లో గళం విప్పుతా
  • ప్రజలను మోసం చేసిన కాంగ్రెస్ కు బుద్ధి చెప్పాలి
  • కారు గుర్తుకు ఓటేసి గెలిపించండి
  • 12వ వార్డు బిఆర్ఎస్ అభ్యర్థి అనీస్ ఫాతిమా ఇందాద్ అలీ

మెదక్ ప్రతినిధి, ఆంధ్రప్రభ : మున్సిపల్ ఎన్నికల్లో ప్రజలకు నిరంతరం అందుబాటులో ఉండే తనను ఆశీర్వదించి గెలిపించాలని మెదక్ పట్టణంలోని 12వ వార్డు బిఆర్ఎస్ అభ్యర్థి అనీస్ ఫాతిమా ఇందాద్ అలీ పేర్కొన్నారు. శనివారం మెదక్ పట్టణంలోని రషీద్ కాలనీ, పిల్లికోటల్ వీధుల్లో కారు గుర్తుకు ఓటేయాలని కోరుతూ ఇంటింటికి ముమ్మరంగా ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. కాంగ్రెస్ రెండేళ్ల పాలనలో సంక్షేమం, అభివృద్ధిని పూర్తిగా విస్మరించిందన్నారు. 420 హామీలను విస్మరించి ప్రజలను మోసం చేసిన కాంగ్రెస్ కు బుద్ధి చెప్పాలన్నారు. కేసీఆర్ హయాంలో బిఆర్ఎస్ చేసిన సంక్షేమ పథకాలను ప్రజలు గుర్తు చేసుకుంటున్నారని తెలిపారు. అందరికీ అందుబాటులో ఉండే తనకు ఒక్క అవకాశం కల్పించి కౌన్సిలర్ గా గెలిస్తే వార్డును అన్ని రంగాల్లో అభివృద్ధి పరుస్తానని ఓటర్లను అభ్యర్థించారు. ఈ కార్యక్రమంలో కార్యకర్తలు, నాయకులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.

Leave a Reply