Warangal | ఓటు హక్కు ఉన్న ఉపాధ్యాయులు స్పెషల్ సీఎల్ వినియోగించుకోవచ్చు..

Warangal | ఓటు హక్కు ఉన్న ఉపాధ్యాయులు స్పెషల్ సీఎల్ వినియోగించుకోవచ్చు..
Warangal, కరిమాబాద్, ఆంధ్రప్రభ : నేడు జరుగుతున్న మున్సిపల్ ఎన్నికల్లో ఓటు హక్కు ఉన్న ఉపాధ్యాయులు, ఉద్యోగులు స్పెషల్ లీవ్ ఉపయోగించుకోవచ్చని వరంగల్ జిల్లా కలెక్టర్ అనుమతి మేరకు వరంగల్ జిల్లా పిఆర్టియు టీఎస్ జిల్లా అధ్యక్షుడు ఈదునూరి రవీందర్ రెడ్డి తెలిపారు. వరంగల్ జిల్లా కలెక్టర్ డాక్టర్ సత్య శారదను పి ఆర్ టి యు టి ఎస్ జిల్లా అధ్యక్షుడు ఈదునూరి రవీందర్ రెడ్డి ఆధ్వర్యంలో ప్రత్యేక బృందం కలెక్టర్ ను కలిసి మున్సిపల్ ఎన్నికలలో ఓటు హక్కు ఉన్న, ప్రభుత్వ ఉద్యోగులకు, ఉపాధ్యాయులకు స్పెషల్ సి.ఎల్ ను నేడు 11.02.2026న వినియోగించుకొనేలా జిల్లా కలెక్టర్ల కు ఆదేశాలు ఇవ్వాలని కోరారు.
ఉపాధ్యాయ ఎమ్మెల్సీ పింగళి శ్రీపాల్ రెడ్డి, రాష్ట్ర ఎన్నికల అధికారి రాణికుముదిని కలిసి విజ్ఞప్తి చేశారు. వరంగల్ జిల్లా ఓటు హక్కు కలిగిన ఉద్యోగులు, స్పెషల్ సి ఎల్ వినియోగించుకొనేలా అనుమతించాలని వరంగల్ జిల్లా కలెక్టర్ ను కోరారు. దీనికి స్పందించిన కలెక్టర్ గతంలో మాదిరిగా ఓటు హక్కు కలిగిన ఉపాధ్యాయులు స్పెషల్ సిఎల్ ను వాడుకోవచ్చునని తెలియచేశారని ఈదునూరి రవీందర్ రెడ్డి తెలిపారు. ఈ కార్యక్రమంలో పిఆర్టి ప్రధాన కార్యదర్శి మహేందర్, ప్రతాప్ సింగ్ , యాకూబురెడ్డి, పి ఆర్ టి యు మండల అధ్యక్ష కార్యదర్శులు పాల్గొన్నారు.
