Warangal | డ్రగ్స్‌ రహిత సమాజ నిర్మాణమే లక్ష్యం

Warangal | డ్రగ్స్‌ రహిత సమాజ నిర్మాణమే లక్ష్యం

డ్రగ్ ఫ్రీ సొసైటీకై కంకణబద్దులు కావాలి
మత్తు మహమ్మరిపై సమరం సాగిద్దాం
డ్రగ్స్ కట్టడికై ప్రజలంతా భాగస్వామ్యులు కావాలి
వరంగల్‌ పోలీస్‌ కమిషనర్‌ సన్‌ ప్రీత్‌ సింగ్‌


Warangal | వరంగల్ క్రైమ్, ఆంధ్రప్రభ : డ్రగ్స్‌ రహిత సమాజ నిర్మాణం (drug-free society) కోసమై ప్రతి ఒక్కరూ కంకణ బద్దులు కావాలని వరంగల్‌ పోలీస్‌ కమిషనర్‌ సన్‌ ప్రీత్‌ సింగ్‌ (Sunpreet Singh) పిలుపునిచ్చారు. మత్తు మహమ్మరిపై ప్రజలంతా స్వచ్ఛంధంగా సమరం సాగించాలని కూడా పిలుపునిచ్చారు. డ్రగ్స్ ను కట్టడి చేయడమే మనందరి లక్ష్యం కావాలని వరంగల్‌ పోలీస్‌ కమిషనర్‌ సన్ ప్రీత్ సింగ్ ఆకాంక్షను వ్యక్తం చేశారు. వరంగల్‌ పోలీస్‌ కమిషనరేట్‌ పరిధిలో మత్తు పదార్థాల నియంత్రణకై చేపట్టిన చర్యల్లో భాగంగా, మత్తు పదార్థాల వినియోగించే వారితో పాటు, విక్రయాలకు పాల్పడే వారిని గుర్తించేందుకు యాక్షన్ ప్లాన్ రూపొందించారు.

అలాగే యువత మత్తు పదార్థాలకు దూరంగా వుండాలని తెలిపే విధంగా డ్రగ్స్‌ కంట్రోల్‌ టీం అధ్వర్యంలో సే నో టు డ్రగ్స్ నినాదంతో రూపొందించిన ప్రచార గొడ పత్రికలను వరంగల్‌ (Warangal) పోలీస్‌ కమిషనర్‌ సన్ ప్రీత్ సింగ్ గురువారం అధికారులతో కలసి కమిషనరేట్‌ కార్యాలయంలో అవిష్కరించారు. అనంతరం పోలీస్‌ కమిషనర్‌ సన్ ప్రీత్ సింగ్ మాట్లాడుతూ మత్తు పదార్థాల వినియోగంతో యువత భవిష్యత్తు ప్రశ్నార్థకంగా మారిందన్నారు. యువత భవిష్యత్తును భవితవ్యాన్ని కాపాడుకోవడం మనందరి ప్రధాన కర్తవ్యమన్నారు. మత్తు పదార్థాల నియంత్రణలో ప్రజలు సైతం పరోక్షంగా తమ వంతు సహకారాన్ని అందించాలని కోరారు.

ఇందుకోసం ఎవరైన మత్తు పదార్థాల విక్రయాలు, వినియోగాలకు పాల్పడితే తక్షణమే 8712584473, 8712685299 నంబర్లకు సమచారం అందించి డ్రగ్స్‌ రహిత సమాజం (drug-free society) కై భాగస్వాములు కావాలని విజ్ఞప్తి చేశారు. సమాచారం అందించిన వారి వివరాలను గోప్యంగా ఉంచుతామని వరంగల్‌ పోలీస్‌ కమిషనర్‌ హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో పరిపాలన విభాగం అదనపు డిపిపి రవి, స్పెషల్‌ బ్రాంచ్‌ ఏసిపి డాక్టర్ మూల జితేందర్‌ రెడ్డి, ఆర్‌.ఐ శివకేశవులు, ఇన్స్‌స్పెక్టర్‌ సతీష్‌, ఆర్‌.ఎస్‌.ఐలు పూర్ణచందర్‌ రెడ్డి, మనోజ్‌ రెడ్డి,నాగరాజు, ర్యాపిడో సంస్థ ప్రతినిధులు దర్గారావు, సందీప్‌ పాల్గోన్నారు.

Leave a Reply