Warangal | కేసీఆర్ చిత్రపటానికి పాలాభిషేకం

Warangal | కేసీఆర్ చిత్రపటానికి పాలాభిషేకం
Warangal | వరంగల్ జిల్లా, ఆంధ్రప్రభ : తెలంగాణ దివస్ సందర్భంగా పర్వతగిరి మండల కేంద్రంలో కేసీఆర్ (KCR) చిత్రపటానికి మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు (Errabelli Dayakar Rao) పాలాభిషేకం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కేసీఆర్ ప్రాణాలను పణంగా పెట్టి తెలంగాణ సాధించారని, కొట్లాడి తెచ్చుకున్న రాష్ట్ర అభివృద్ధి చేసుకునే లోపే ఆగమైపోతుందని ఈ సందర్భంగా ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.
