Warangal | కాంగ్రెస్ నాయకుల సంబురాలు..
Warangal | చెన్నారావుపేట, ఆంధ్రప్రభ : జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో కాంగ్రేస్ అభ్యర్థి నవీన్ యాదవ్ గెలుపొందడంతో ఈ రోజు చెన్నారావుపేట మండల కాంగ్రేస్ పార్టీ అధ్యక్షుడు సిద్దన రమేష్ ఆధ్వర్యంలో మండల కేంద్రంలో పార్టీ నాయకులు బాణాసంచా కాల్చి సంబరాలు జరుపుకున్నారు. ఈ సందర్భంగా సిద్దన మాట్లాడుతూ.. కాంగ్రెస్ ప్రభుత్వం(Congress Government) చేస్తున్న అభివృద్ధికి ప్రజలు పట్టం కట్టారని, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి(Chief Minister Revanth Reddy) నాయకత్వం పట్ల ప్రజల్లో విశ్వాసానికి ఈ ఉప ఎన్నికల ఫలితాలే నిదర్శమని అన్నారు.
రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో ఎమ్మెల్యే దొంతి మాధవరెడ్డి ఆశీస్సులతో మండలంలో కాంగ్రెస్ పార్టీ(Congress Party) గెలవబోతొందని అన్నారు. ఈ కార్యక్రమంలో నాయకులు మొగిలి వెంకట్ రెడ్డి, కేతిడి వీరారెడ్డి, మంద యాకయ్య, నన్నెబోయిన రమేష్, తప్పేట రమేష్, భూక్య మోహన్, బండి హరీష్, కంది నారాయణ రెడ్డి, మెంతుల రమేష్, లక్క విజయ్, కుండే కుమారస్వామి, రాజు, ప్రవీణ్ తదితరులు పాల్గొన్నారు.

