Warangal | పెన్షనర్ల సమస్య వెంటనే పరిష్కరించాలి

Warangal | పెన్షనర్ల సమస్య వెంటనే పరిష్కరించాలి
- నేడు చలో జిల్లా కలెక్టరేట్
Warangal | కరీమాబాద్, ఆంధ్రప్రభ : చలో వరంగల్ కలెక్టరేట్ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని ఎస్జీపీ ఏటి జిల్లా అధ్యక్షుడు తుమ్మ వీరయ్య, ప్రధాన కార్యదర్శి గునిగంటి సాంబయ్య పిలుపునిచ్చారు. మార్చి 2024 సర్వీస్ నుండి రిటైర్ అయిన ఉద్యోగ ఉపాధ్యాయులకు గత 18 నెలలుగా ఒక్క మంత్లీ పెన్షన్ తప్ప, ఎలాంటి రిటైర్మెంట్ బెనిఫిట్స్ చెల్లింపబడలేదు. ఆర్ధిక ఇబ్బందులున్నా కొంతమంది తమ ప్రాణాలు వదిలారు. ఈ దౌర్భాగ్య పరిస్థితి గతంలో లేదు.
వెంటనే రిటైర్మెంట్ బెనిఫిట్స్ చెల్లింపులు చేయాలని డిమాండ్ చేస్తూ ఇవాళ హనుమకొండలోని ఏకశిలా పార్క్ ధర్నా చౌక్ వద్ద నిరాహార దీక్ష చేయాలని జాక్ రాష్ట్ర సంఘం పిలుపు ఇచ్చినందున వరంగల్ జిల్లా శాఖ పెన్షనర్ మిత్రులంతా ఉ. 10-30 నుండి 3-00 pm వరకు అధిక సంఖ్యలో హాజరై కార్యక్రమాన్ని విజయవంతం చేయాలన్నారు. మధ్యాహ్నం 3-00 లకు జిల్లా ప్రతినిధి బృందం జిల్లా కలెక్టర్ కు మెమోరాండం సమర్పిస్తారు. జిల్లా కమిటీ సభ్యులు, యూనిట్ బాధ్యులు అధిక సంఖ్యలో కదిలిరావాలని వారు పిలుపునిచ్చారు.
