నవీన్ రాజ్ దంపతులకు పుష్పగుచ్చం అందజేత‌..

నవీన్ రాజ్ దంపతులకు పుష్పగుచ్చం అందజేత‌..

కరీమాబాద్, ఆంధ్రప్రభ : వరంగల్ నగరంలోని కాంగ్రెస్ పార్టీ నాయకుడు గోపాల్ నవీన్ రాజును ఆయన స్వగృహంలో నగరంలోని కాంగ్రెస్ పార్టీ నాయకులు మర్యాదపూర్వకంగా కలిశారు. మంగళవారం నవీన్ రాజ్ వివాహ మహోత్సవం పురస్కరించుకొని పలువురు నేతలు ఆయన స్వగృహానికి చేరుకొని పూల బొకే అందజేసి శుభాకాంక్షలు తెలిపారు.

ముందుగా పార్టీ నాయకులు, కార్యకర్తలతో కలిసి ఆయన సతీసమేతంగా భద్రకాళి గుడి, శ్రీ వెంకటేశ్వర స్వామి గుడిలో పూజలు నిర్వహించారు. కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ డివిజన్ అధ్యక్షుడు రేణిగుంట్ల శివకుమార్, ప్రవీణ్ ,శ్రీరాంరాజేష్, పగడాల సతీష్, అక్షిత్ పటేల్ తదితరులు పుష్పగుచ్చం అందజేసి శుభాకాంక్షలు తెలిపారు.

Leave a Reply