war effect| అన్ని రంగాలపై ప్రభావం

war effect| అన్ని రంగాలపై ప్రభావం
- మధ్యప్రాచ్యంలో పెరుగుతున్న ఉద్రిక్తతలు
- హార్ముజ్ ప్రభావం… చమురు ధరల షాక్
- ప్రపంచ దేశాలు, రంగాలపై దెబ్బ
- గెలుపెవరిదైనా… నష్టం ప్రపంచానిదే
ఆంధ్రప్రభ వెబ్‌డెస్క్ : మధ్యప్రాచ్యంలో పరిస్థితి రోజు రోజుకీ తీవ్రంగా, ఆందోళనకరంగా మారుతోంది. డొనాల్డ్ ట్రంప్ తీసుకుంటున్న కఠిన వైఖరి, ఇరాన్ నుంచి వస్తున్న ప్రతిస్పందన.. ఇవన్నీ ప్రపంచాన్ని ఒక సంక్షోభ దిశగా నడిపిస్తున్నాయన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. బయటకు అమెరికా దృఢంగా, శక్తివంతంగా కనిపించినా, లోలోపల ఒత్తిడి, ఆర్థిక భారం పెరుగుతోందని విశ్లేషకులు చెబుతున్నారు.
అణు ఒప్పందం తర్వాత పరిస్థితి మరింత సంక్లిష్టంగా, అనిశ్చితిగా మారింది. ఇప్పుడు మళ్లీ ఉద్రిక్తతలు పెరిగి యుద్ధ వాతావరణం సృష్టిస్తున్నాయి. ప్రపంచ చమురు సరఫరాకు కీలకమైన Strait of Hormuz వద్ద ఉద్రిక్తతలు పెరిగితే ఆయిల్ ధరలు ఒక్కసారిగా పెరిగే ప్రమాదం ఉంది. ఇది భారత్ వంటి దేశాలకు భారీ ఆర్థిక దెబ్బ కావొచ్చు. పెట్రోల్, డీజిల్ ధరలు పెరగడం వల్ల ప్రజలపై ఆర్థిక భారము మరింత పెరుగుతుంది.
దేశాలు, రంగాలపై ప్రభావం
ఈ పరిస్థితి కేవలం మధ్యప్రాచ్యానికే పరిమితం కాదు. యూరప్, ఆసియా దేశాలు కూడా ఆందోళనలో ఉన్నాయి. చమురు సరఫరా లోపిస్తే పరిశ్రమలు, విమానయాన, రవాణా రంగాలు దెబ్బతినే అవకాశం ఉంది. స్టాక్ మార్కెట్లు కూడా అస్థిరంగా మారే ప్రమాదం ఉంది. పెట్టుబడిదారుల్లో భయాందోళనలు పెరిగి, ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో అనిశ్చితి మరింత పెరుగుతుంది.
అమెరికా పరిస్థితి… పైకి బలం, లోపల ఒత్తిడి?
అమెరికా సైనికంగా బలమైన దేశమే అయినప్పటికీ, దీర్ఘకాల యుద్ధం అంటే భారీ ఖర్చు, రాజకీయ ఒత్తిడి. అందుకే బయటకు గాంభీర్యం కనిపించినా, లోపల సంక్షోభ సంకేతాలు ఉన్నాయని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. మొత్తానికి ఇది రెండు దేశాల మధ్య పోరు మాత్రమే కాదు… ప్రపంచాన్ని కుదిపే ఒక పెద్ద సంక్షోభం. గెలుపెవరిదైనా… నష్టం మాత్రం ప్రపంచానిదే అన్న భావన మరింత బలపడుతోంది.
నష్టం ఇలా..
👉 చమురు ధరలు పెరిగితే ప్రపంచం మొత్తం తీవ్ర ప్రభావం
👉 ఆర్థిక వ్యవస్థల్లో అస్థిరత, ఆందోళన
👉 సాధారణ ప్రజలపై భారీ భారం
