war| 400 విమానాలు ర‌ద్దు

war| 400 విమానాలు ర‌ద్దు

ఆంధ్ర‌ప్ర‌భ వెబ్‌డెస్క్ : ఇరాన్‌పై ఇజ్రాయెల్, అమెరికా దాడుల నేపథ్యంలో పశ్చిమాసియాలో పరిస్థితులు ఉద్రిక్తంగా మారాయి. యుద్ధం నేప‌థ్యంలో ఇరాన్‌, ఇజ్రాయెల్‌ సహా పలు దేశాలు తమ గగనతలాలను మూసివేశాయి. దాంతో ఇవాళ ఆదివారం భారత్‌ నుంచి వెళ్లాల్సిన దాదాపు 400కు పైగా విదేశీ విమానాలను రద్దుచేశారు. ఈ విషయాన్ని భారత పౌర విమానయాన మంత్రిత్వ శాఖ వెల్లడించింది.

ఇంకా ఎన్ని విమానాలు రద్దవుతాయి, ఎన్ని ఆలస్యమవుతాయన్న అంశంపై విమానయాన సంస్థల అధికారులతో చర్చలు కొనసాగుతున్నాయని తెలిపింది. ఇప్పటికే ఫిబ్రవరి 28న 410 దేశీయ విమానాలను రద్దు చేసినట్లు మంత్రిత్వ శాఖ స్పష్టం చేసింది. విమానాల రద్దుతో విమానాశ్రయాల్లో రద్దీ పెరిగే అవకాశాన్ని దృష్టిలో ఉంచుకుని, టెర్మినల్స్ వద్ద ప్రయాణికులకు సహకారం అందించేందుకు, క్రౌడ్ మేనేజ్‌మెంట్ నిర్వహణకు పలువురు సీనియర్ అధికారులను నియమించినట్లు అధికారులు తెలిపారు.

Leave a Reply