Wall poster | రహదారి భద్రతపై అవగాహన ఉండాలి

Wall poster | రహదారి భద్రతపై అవగాహన ఉండాలి
- జిల్లా కలెక్టర్ డీకే బాలాజీ
Wall poster | మచిలీపట్నం, ఆంధ్రప్రభ : జిల్లాలో ప్రమాదాలు నివారించేందుకు రహదారి భద్రతపై ప్రజలందరికీ విస్తృతంగా అవగాహన కలిగించాలని జిల్లా కలెక్టర్ డీకే బాలాజీ అధికారులను ఆదేశించారు. గురువారం నగరంలోని వారి క్యాంపు కార్యాలయంలో 37వ జాతీయ రహదారి భద్రత మాసోత్సవాల సందర్భంగా వాల్‌పోస్టర్‌ను కలెక్టర్ ఆవిష్కరించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాల మేరకు జనవరి 1వ తేదీ నుంచి 31వ తేదీ వరకు జాతీయ రహదారి భద్రత మాసోత్సవాలను నిర్వహిస్తున్నామన్నారు. ప్రజలు రహదారి భద్రతపై అవగాహన కలిగి ఉండాలని, ఇందుకోసం రవాణా శాఖ అధికారులు విస్తృతంగా ప్రచారం నిర్వహించాలన్నారు. ప్రజల్లో విస్తృతంగా రహదారి భద్రతపై చైతన్యం తీసుకొని వచ్చి రహదారి ప్రమాదాలను నివారించాలన్నారు. వాహనాలు నడపడంలో శిక్షణతో భద్రత లభిస్తుందని, అలాగే సాంకేతికత ద్వారా పరివర్తన చెందాలన్నారు.
ఇందులో ముఖ్యంగా వాహనాల డీలర్లను, లారీ యజమానుల సంఘాలను, డ్రైవర్ శిక్షణ కేంద్రాలను భాగస్వాములు చేసి కార్యక్రమాన్ని విజయవంతం చేయాలన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా రవాణా అధికారి శ్రీనివాసరావు, డీపీటీవో వెంకటేశ్వర్లు, ఎంవీఐలు సిద్ధిక్, నాని, నారాయణస్వామి, సంగీతరావు ఏఎంవీఐ సోనీప్రియా తదితర రవాణా శాఖ సిబ్బంది పాల్గొన్నారు.
