wall copies | సామూహిక వివాహాలు నిర్వహించడం ఆదర్శనీయం

wall copies | జైనూర్ /సిర్పూర్-(యు), ఆంధ్రప్రభ : కొమరం భీం, అసిఫాబాద్ జిల్లా మండలంలోని మహాగాంలోని శ్రీశ్రీ సంత్ సూరోజీబాబా సేవా ఆశ్రమం ఆధ్వర్యంలో ఈ నెల 15వ తేదీ నుంచి నిర్వహించనున్న మహాశివరాత్రి ఉత్సవాల, సామూహిక వివాహాలకు సంబంధించిన గోడ ప్రతులను డీసీసీ కార్యాలయంలో మంగళవారం డీసీసీ అధ్యక్షురాలు ఆత్రం సుగుణక్క విడుదల చేశారు. ఈ సందర్భంగా ఆత్రం సుగుణక్క మాట్లాడుతూ.. మహాశివరాత్రి ఉత్సవాలు భక్తి, శ్రద్ధలతో పాటు సామాజిక ఐక్యతను చాటిచెప్పే కార్యక్రమమని అన్నారు. అలాగే సంత్ సూరోజీబాబా సేవా ఆశ్రమంలో ప్రతి ఏడాది శివరాత్రికి నిర్వహిస్తున్న సామూహిక వివాహాలు పేద, నిరుపేద కుటుంబాలకు ఎంతో ఊరట కలిగిస్తున్నాయని ప్రశంసించారు.

శివరాత్రి ఉత్సవాలకు సాంఘిక వివాహాలకు అధిక సంఖ్యలో నాయకులు ప్రజలు పాల్గొని విజయవంతం చేయాలని డిసిసి అధ్యక్షురాలు అత్రం సుగుణక్క కోరారు.ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ అసిఫాబాద్ నియోజకవర్గ ఇన్చార్జి ఆజ్మీర శ్యాం నాయక్, సిర్పూర్ (యు )మండల లోని మహాగాం, బూర్నూర్ (బి) సర్పంచులు సెడమెక్కి జానే రావు, పెందూర్ గణపత్, మహాగాం సర్మిడి ఆత్రం ఆనందరావు, కాంగ్రెస్ నాయకులు ఆత్రం జాలింషా, భూపతి, ఉత్సవ కమిటీ సభ్యులు, పాల్గొన్నారు.

Leave a Reply