మరొకరికి తీవ్ర గాయాలు
(ఆంధ్రప్రభ, మచిలీపట్నం ప్రతినిధి) : మచిలీపట్నం (Machilipatnam) రాడార్ కేంద్రం సమీపంలో గోడ కుప్పకూలి ఓ కార్మికుడు మృతిచెందగా .. మరో కార్మికుడు తీవ్రంగా గాయపడ్డాడు. ఈ దుర్ఘటనలో చనిపోయిన వ్యక్తి మచిలీపట్నం బలరాముని పేట (Balaramunipeta) కు చెందిన రాజు అని తెలుస్తోంది.
పల్లె తాళ్ళపాలేనికి చెందిన అంకాని వెంకన్న తీవ్రంగా గాయపడ్డాడు. ఈ ప్రమాదం ప్రాథమిక సమాచారం ప్రకారం, రాడార్ కేంద్రం (Radar center) సమీపంలో ఓ భవనం నిర్మాణానికి పునాది తీస్తుండగా పక్కన గోడ కూలిపోయింది (wall collapsed). పనిచేస్తున్న ఇద్దరు కార్మికులపై గోడ కూలింది. ప్రమాద స్థలికి చేరుకున్నచిలకలపూడి (Chilakalapudi) పోలీసులు విచారణ చేస్తున్నారు.