అభివృద్ధికి మూల స్తంభాలు మహిళలే..

అభివృద్ధికి మూల స్తంభాలు మహిళలే..

  • మహిళ ప్రజా ప్రతినిధులను ఘనంగా సన్మానించిన వాకర్స్ అసోసియేషన్.

నర్సంపేట, ఆంధ్రప్రభ : అభివృద్ధికి మహిళలే మూల స్తంభాలుగా ఉన్నారని వారు అన్ని రంగాలలో ముందుకు వెళ్లాలని నర్సంపేట వాకర్స్ అసోసియేషన్ అధ్యక్ష కార్యదర్శులు డాక్టర్ పుల్లూరి శ్రీనివాస్ గౌడ్, ఆడెపు సదానందంలు అన్నారు. అంతర్జాతీయ మహిళా దినోత్సవ సందర్భంగా నర్సంపేట మినీ స్టేడియంలో ఆదివారం నర్సంపేట మున్సిపల్ చైర్ పర్సన్ చైర్ పర్సన్ పెండెం శ్రీ లక్ష్మీ రామానంద్, 16 మంది మహిళా ప్రజా ప్రతినిధులైన కౌన్సిలర్లకు ఘనంగా సన్మానించారు.

ఈ సందర్భంగా శ్రీనివాస్ గౌడ్ మాట్లాడుతూ నూతనంగా ఎన్నికైన మున్సిపల్ చైర్ పర్సన్, మహిళ కౌన్సిలర్లు నూతన ఉత్సాహంతో మంచి పాలన అందించాలని, నర్సంపేట ప్రాంతంలో క్రీడలు అభివృద్ధికి, మిని స్టేడియంలో సౌకర్యాల ఏర్పాటుకు, స్టేడియం అభివృద్ధికి వాకర్స్ అసోసియేషన్ అభివృద్ధికి కృషి చేయాలని కోరారు. ఈ సందర్భంగా నర్సంపేట మున్సిపల్ చైర్ పర్సన్ శ్రీ పెండం శ్రీలక్ష్మి- రామానంద్ మాట్లాడుతూ.. మున్సిపల్ కార్యవర్గ ఆధ్వర్యంలో నర్సంపేట ప్రాంతంలో క్రీడల అభివృద్ధికి,మినీ స్టేడియంలో సౌకర్యాల ఏర్పాటుకు పూర్తి సహాయ సహకారాలు అందిస్తానని తెలిపారు.

మినీ స్టేడియంలో మహిళల సౌకర్యార్థం టాయిలెట్స్ నిర్మాణం చేపడతామని హామీ ఇచ్చారు.ఈ కార్యక్రమం లో నర్సంపేట వాకర్స్ అసోసియేషన్ ఉపాధ్యక్షులు హైమద్, ప్రధాన కార్యదర్శి ఆడెపు సదానందం, సహాయ కార్యదర్శి గండు రవి గౌడ్, సారంగపాణి, ప్రచార కార్యదర్శి అశోక్, స్టేడియం ఇన్చార్జి కబడ్డీ కోచ్ యాట రవికుమార్ ముదిరాజ్, స్టేడియం ఇన్చార్జి రెజ్లింగ్ కోచ్ సిరపురపు మహేష్, వాకర్స్ అసోసియేషన్ సభ్యులు పాల్గొన్నారు.

Leave a Reply