VRK Nagar | చల్లపల్లి లయన్స్ క్లబ్‌కు అవార్డులు
ఉత్తమ సర్వీస్ క్లబ్, ఉత్తమ ఐఓఎల్ క్యాంపుతోపాటు డిస్ట్రిక్ట్ గవర్నర్ ప్రత్యేక ప్రశంసా అవార్డులు
VRK Nagar | చల్లపల్లి, ఆంధ్రప్రభ : సేవల్లో మేటిగా నిలిచే లయన్స్ క్లబ్ ఆఫ్ చల్లపల్లి వీఆర్కే నగర్‌కు 2024-25 సంవత్సరంలో అందించిన ఉత్తమ సేవలకు జిల్లాస్థాయిలో పలు అవార్డులు లభించాయి. ఇటీవల జరిగిన అవార్డుల ప్రదానోత్సవంలో మాజీ జిల్లా గవర్నర్ గద్దె శేషగిరి చేతుల మీదుగా క్లబ్ ప్రతినిధులు అవార్డులు స్వీకరించారు. చల్లపల్లి లయన్స్ క్లబ్ కార్యాలయంలో జరిగిన సమావేశంలో క్లబ్ అధ్యక్ష, కార్యదర్శులు ముమ్మనేని నాని, వరదా హరిగోపాల్, కోశాధికారి నర్రా సాయిబాబులు అవార్డుల వివరాలు తెలియచేశారు.
చల్లపల్లి లయన్స్ క్లబ్ కు ఉత్తమ సర్వీస్ క్లబ్, ఉత్తమ ఐఓఎల్ క్యాంపు అవార్డు, పర్మినెంట్ ప్రాజెక్టు విభాగంగా లయన్స్ మల్టీపర్పస్ సర్వీస్ సెంటర్ కు కాంప్రహెన్సివ్ కమ్యూనిటీ సర్వీస్ ఎక్సలెన్స్ అవార్డు లభించింది. డిస్ట్రిక్ట్ గవర్నర్ ప్రత్యేక ప్రశంస (స్పెషల్ అప్రిసియేషన్) అవార్డులను రక్తదాన శిబిర నిర్వహణకు గాను తగిరిశ సాంబశివరావుకు, స్వచ్చభారత్ విభాగంలో మోపిదేవి వెంకటేశ్వరరావుకు, ఉత్తమ అధ్యక్షునిగా రాయపాటి రాధాకృష్ణ, ఉత్తమ కార్యదర్శిగా కస్తూరి వెంకట వరప్రసాద్, ఉత్తమ కోశాధికారిగా ముమ్మనేని నానిలకు అవార్డులు అందాయి. డిస్ట్రిక్ట్ గవర్నర్ ఎక్సలెన్స్ అవార్డు అడిషనల్ క్యాబినెట్ సెక్రటరీ నర్రా సాయిబాబుకు లభించింది. క్లబ్ కు 9 అవార్డులు రావటం పట్ల లయన్స్ క్లబ్ ప్రతినిధులు సంతోషం వ్యక్తంచేశారు. రానున్న రోజుల్లో మరింతగా సేవాకార్యక్రమాలు నిర్వహిస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో క్లబ్ పెద్దలు ఎస్ఏ.భాషా, ఉప్పల సాంబశివరావు, దుబ్బుల సాం బశివరావు, రాయపాటి రాధాకృష్ణ, కంఠంనేని సుధాకరరావు, అంబటి శంకరరావు, షేక్ రఫీ తదితరులు పాల్గొన్నారు.

