వీఆర్ఏ పై దాడి చేసిన వ్యక్తిని వెంటనే అరెస్ట్ చేయాలి

వీఆర్ఏ పై దాడి చేసిన వ్యక్తిని వెంటనే అరెస్ట్ చేయాలి
- వీఆర్ఏ సంఘం నాయకులు
భీమదేవరపల్లి, ఆంధ్రప్రభ ; భీమదేవరపల్లి మండలం వంగర గ్రామానికి చెందిన వీఆర్ఏ వేముల సతీష్ పై దాడి చేసిన వ్యక్తిని వెంటనే అరెస్టు చెయ్యాలని భీమదేవరపల్లి మండల వీఆర్ఏ సంఘం నాయకులు డిమాండ్ చేశారు. మంగళవారం తాసిల్దార్ కార్యాలయం ముందు విఆర్ఏ పై దాడి చేసినందుకు ఫ్లకార్డ్ లతో నిరసన తెలిపారు.
విధి నిర్వహణలో భాగంగా వీఆర్ఏ వేముల సతీష్ ఆర్డివో ఆఫీస్ నుండి వచ్చిన నోటీసును ఇవ్వడం కోసం వంగర గ్రామానికి చెందిన గజ్జల రమేష్ నివాసానికి వెళ్లి నోటీసులు అందించగా నోటీసులు తీసుకోను సంతకం పెట్టను అంటూ బూతులు తిడుతూ దాడి చేసినట్లు బాధితుడు తెలిపారు.
అంతేకాకుండా నేను సర్పంచి భర్తను, వార్డ్ మెంబర్ ను నన్నేం చేయలేవు అంటూ బెదిరింపులకు పాల్పడి తీవ్రంగా దాడి చేసినట్లు బాధితుడు తెలిపారు. జరిగిన సంఘటనపై తహసిల్దార్ కి తెలపగా పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయాలని ఆదేశించినట్టు బాధితుడు తెలిపారు. తనపై అకారణంగా దాడి చేసిన వ్యక్తిని వెంటనే అరెస్టు చేసి నాకు న్యాయం చేయాలని బాధితుడు కోరడం జరిగింది.
