నేడు బీహార్ లో పోలింగ్..

నేడు బీహార్ లో పోలింగ్..


బీహార్ లో ఈరోజు తొలి విడతగా 121 నియోజవర్గాల్లో పోలింగ్ జరగనుంది. ఈ నియోజకవర్గాల్లో ఎవరు పై చేయి సాధిస్తారనేది ఆసక్తిగా మారింది. అయితే.. ఈ తొలి విడత పోలింగ్ పై రెండు కూటములు ధీమగా ఉన్నాయి. మిథిల, కోసి, ముంగేర్ డివిజన్లలోని 18 జిల్లాల్లో ఉన్న నియోజకవర్గాల్లో తొలి విడత పోలింగ్ జరగనుంది. మొత్తం 1,314 మంది అభ్యర్ధులు పోటీలో ఉన్నారు. 2020 ఎన్నికల్లో ఎన్టీయే 70 సీట్లు గెలుచుకుంది. ఈసారి 17 నుంచి 19 సీట్లు అదనంగా గెలుస్తామని ఎన్డీయే నమ్మకంగా చెబుతుంది. గత ఎన్నికల్లో ఎన్టీయే అధిక్యం సాధించింది కానీ.. ఈసారి ఎన్నికల్లో తామే అధిక్యం సాధిస్తామని ఆర్జేడీ కూటమి గట్టిగా చెబుతుంది. అయితే.. మధ్యలో జన సూరాజ్ పార్టీ అధినేత ప్రశాంత్ కిషోర్ ఎవరి ఓట్లు చీల్చుతాడు అనేది ఆసక్తిగా మారింది.

Leave a Reply