బిఆర్ఎస్ అభ్యర్థికి ఓటర్ల ఆశీర్వాదం..

పరకాల, ఆంధ్రప్రభ : పరకాల పురపాలక సంఘం 12వ వార్డు ఓటర్లు బిఆర్ఎస్ అభ్యర్థి గంట కళావతికి ఓటర్లు బొట్టు పెట్టి ఎన్నికల్లో గెలవాలని ఆశీర్వదిస్తున్నారు. శనివారం రోజు బిఆర్ఎస్ అభ్యర్థి గంట కళావతి ప్రచారం జోరుగా నిర్వహించారు. కారు గుర్తుకు ఓటు వేసి బిఆర్ఎస్ పార్టీని 12వ వార్డులో గెలిపించాలని ఓటర్లకు కళావతి విజ్ఞప్తి చేశారు. వార్డు ప్రజలకు అందుబాటులో ఉంటూ వార్డులోని సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని ఓటర్లను అభ్యర్థించారు. మీ ఇంటి ఆడబిడ్డ గా 12వ వార్డులో బిఆర్ఎస్ అభ్యర్థిగా పోటీ చేయడం జరుగుతుందని, వార్డు అభివృద్ధి కోసం సమస్యల పరిష్కారం కోసం బిఆర్ఎస్ పార్టీ కారు గుర్తుకు ఓటు వేసి అత్యధిక మెజార్టీతో గెలిపించాలని 12వ వార్డ్ అభ్యర్థి గంట కళావతి ఓటర్లను కోరారు. అభ్యర్థి వెంట బిఆర్ఎస్ 12వ వార్డ్ నాయకులు, కార్యకర్తలు తదితరులు ఉన్నారు.

Leave a Reply