Voters | పోలింగ్ ప్రశాంతం
- అదనపు కలెక్టర్ చంద్రయ్య, డీసీపీ భాస్కర్
Voters | లక్షెట్టిపేట, ఆంధ్రప్రభ : రెండవ సాధారణ స్థానిక సంస్థల మొదటి విడత ఎన్నికల్లో భాగంగా మండలంలోని అన్ని గ్రామాల్లో ఎన్నికల పోలింగ్ గురువారం ప్రశాంతంగా జరిగింది. ప్రతి పోలింగ్ సెంటర్‌లో చలిని లెక్కచేయకుండా ఓటర్లు ఉదయం నుంచే ఓటు వేయడానికి బారులు తీరారు. అదనపు కలెక్టర్ చంద్రయ్య, డీసీపీ భాస్కర్‌లు పలు గ్రామాల్లోని పోలింగ్ కేంద్రాలను పరిశీలించి ఓటింగ్ సరళిని పర్యవేక్షించారు. వెంకట్రావ్ పేట్ లోని ప్రభుత్వ పాఠశాల వద్ద 90 ఏళ్ల వృద్ధురాలు ఓటు వేయడానికి వచ్చే క్రమంలో ఇబ్బంది పడితే అక్కడే విధులు నిర్వహిస్తున్న స్పెషల్ బ్రాంచ్ ఎస్సై శిరీష స్వయంగా వీల్ చైర్ లో ఓటింగ్ గది వద్దకు తీసుకెళ్లారు.
మండలంలోని పలు గ్రామాల్లో పోలైన ఓటింగ్ శాతాన్ని అధికారులు వెల్లడించారు. మండలంలోని అంకతిపల్లి 87.93, బలరావ్ పేట 90.07, చందారం 76.56, దౌడపల్లి 76.01, ఎల్లారం 85.27, గుల్లకోట 82.73,హనుమంత్ పల్లె 68.33, జెండా వెంకటాపూర్ 87.44, కొత్త కొమ్ముగూడెం 84.14, కొత్తూరు 87.93, లక్ష్మీపూర్ 81.09, మిట్టపల్లి 89.09, పాత కొమ్ముగూడెం 81.77, పోతపల్లె 84.65, రంగపేట 87.84, సూరారం 87.53, తిమ్మాపూర్ 87.68, వెంకట్రావుపేట్ 76.87 పోలింగ్ నమోదు కాగా, మొత్తం మండలంలో 82.34 ఓటింగ్ శాతం అయినట్లు ఏంపీడీఓ సరోజ మీడియాకు తెలిపారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరుగకుండా పోలీసులు గట్టి బందోబస్త్ నిర్వహించారు.

