Voters | గెలిపించండి.. సంగంబండను అభివృద్ధిచేస్తా..

Voters | గెలిపించండి.. సంగంబండను అభివృద్ధిచేస్తా..

  • సర్పంచ్ అభ్యర్థి సందనోళ్ళ కళావతి లక్ష్మీకాంత్ రెడ్డి

Voters | మక్తల్, ఆంధ్రప్రభ : సంగంబండ గ్రామ అభివృద్ధి కోసం గ్రామంలోని ప్రజలందరూ ఆదరించి సర్పంచ్ గా గెలిపిస్తే గ్రామాన్ని అభివృద్ధి చేసి చూపిస్తానని నారాయణ పేట జిల్లా మక్తల్ మండలంలోని సంగంబండ గ్రామ సర్పంచ్ అభ్యర్థిగా బీజేపీ మద్దతుతో పోటీ చేస్తున్న సర్పంచ్ అభ్యర్థి సందనోళ్ళ కళావతి లక్ష్మీకాంత్ రెడ్డి అన్నారు. శనివారం సంగంబండ గ్రామంలో తన మద్దతు దారులతో కలిసి ఇంటింటి ప్రచారానికి శ్రీకారం చుట్టారు.

ఈసందర్భంగా ఆమె మాట్లాడుతూ… గ్రామంలో నెలకొన్న వివిధ సమస్యలు పరిష్కరించేందుకు శక్తి వంచన లేకుండా కృషి చేస్తానన్నారు. గత పాలకుల నిర్లక్ష్యం మూలంగా గ్రామంలో అనేక సమస్యలు పరిష్కారం కాలేదన్నారు. సర్పంచ్ గా ఆదరిస్తే గ్రామ సర్వతోముఖాభివృద్ధికి కృషి చేస్తానన్నారు. అంతే కాకుండా నిరుపేదలకు ప్రభుత్వ సంక్షేమ పథకాలు మంజూరు చేయించే బాధ్యత తీసుకుంటానన్నారు. రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన సంక్షేమ పథకాలు నిరుపేదలకు వచ్చే విధంగా చూస్తానని గ్రామస్తులకు విజ్ఞప్తి చేశారు. గ్రామంలోని ప్రతి సమస్యను తెలుసుకున్న వ్యక్తిగా నన్ను ఆదరించి గెలిపిస్తే గ్రామాన్ని అన్ని విధాలుగా అభివృద్ధి చేసి చూపిస్తానన్నారు.

గ్రామ అభివృద్ధికి నిస్వార్ధంగా సేవ చేసే భాగ్యం కల్పించాలని ఓటర్లను విజ్ఞప్తి చేశారు. గ్రామంలో మౌలిక సదుపాయాల కల్పనకు కృషి చేయడంతో పాటు ప్రభుత్వ సంక్షేమ పథకాలు అర్హులైన ప్రతి ఒక్కరికి పారదర్శకంగా అందిస్తానన్నారు. ఆదరించి ఓటు వేసి గెలిపిస్తే సంగంబండ గ్రామ రూపురేఖలు మారుస్తానన్నారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎంపిటిసి జి.బలరాం రెడ్డి, గావినోళ్ల బలరాం రెడ్డి, నరసింహ రెడ్డి, చిన్నారెడ్డి, స్వప్న వార్డు అభ్యర్థులు నరసింహ, కృష్ణారెడ్డి, ఎం.నాగిరెడ్డి, వై.పల్లవి, తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply