Vote | అన్ని రంగాల్లో అభివృద్ధి చేస్తా…

Vote | దస్తూరాబాద్, ఆంధ్రప్రభ : గ్రామ అభివృద్ధికి ఈనెల 11వ తేదీన జరగనున్న పంచాయతీ ఎన్నికల్లో కత్తెరకు ఓటేసి గెలిపించాలని బుట్టాపూర్ గ్రామపంచాయతీ వీధుల్లో ఇంటింటా తిరుగుతూ సోమవారం సర్పంచ్ అభ్యర్థి తిప్పని రంజిత్ ప్రచారాన్ని చేపట్టారు. గ్రామ ప్రజలకు సేవ చేయడమే ప్రధాన లక్ష్యంగా పని చేస్తానని, గ్రామంలో నెలకొన్న అన్ని సమస్యలను తాను సర్పంచ్ పదవి బాధ్యతలు చేపట్టిన తర్వాత అన్ని సమస్యలను తెలుసుకొని నియోజకవర్గం ఎం ఎల్ ఏ వెడ్మ బొజ్జు సహకారంతో ఎప్పటికప్పుడు పరిష్కారం చేస్తానని హామీ ఇచ్చారు. ముఖ్యంగా గ్రామంలో నెలకొన్న ముఖ్యమైన సమస్యలను పరిష్కరించేందుకు మొదటి ప్రాధన్యతను తాను ఇస్తానని హామీ ఇచ్చారు. ఇప్పటికె సీసీ రోడ్డు, డ్రైనేజీ పనులు చేసి, సమస్య పరిష్కారం చేసానని.. భవిష్యత్తులో గ్రామాన్ని మరింత అభివృద్ధి బాటలో ముందుకు తీసుకెళ్తానని అన్నారు.
