Vote | 33వ వార్డులో భారీ మెజారిటీతో గెలిపించండి..

Vote | పరకాల, ఆంధ్రప్రభ : పట్టణంలోని 17వ వార్డులో బీఆర్ఎస్ పార్టీ జోరుగా ప్రచారం నిర్వహించారు. బీఆర్‌ఎస్ 17వ వార్డు అభ్యర్థి శనిగరం రజిని నవీన్ ఓటర్లను కోరారు. ఈ రోజు పరకాల మున్సిపాలిటీ 17వ వార్డులో బీఆర్ఎస్ అభ్యర్థి శనిగరం రజిని నవీన్ ఓటర్లను కలిసి వాటిలోని సమస్యలు తెలుసుకుంటూ శాశ్వత పరిష్కారానికి కృషి చేస్తానని వార్డులోని ఓటర్లకు విజ్ఞప్తి చేశారు.
పరకాల మాజీ ఎమ్మెల్యే చల్లా ధర్మరెడ్డి ఆశీస్సులతో 17వ వార్డులో అభివృద్ధి పథంలో నడిపిస్తానని, ఈ సందర్భంగా అభ్యర్థి శనిగరం రజిని నవీన్ మాట్లాడుతూ …వార్డు ప్రజల సమస్యల పరిష్కారానికి కృషి చేయడం జరుగుతుందన్నారు. తనపై నమ్మకం ఉంచి ఓటర్లు ఆశీర్వదిస్తే, వార్డులోని ప్రతి సమస్యను పరిష్కరించి అభివృద్ధికి కృషి చేస్తానని శనిగరం రజిని నవీన్ హామీ ఇచ్చారు. అభ్యర్థి వెంట శ్రీ కుంకుమేశ్వర స్వామి దేవస్థానం మాజీ చైర్మన్లు చందుపట్ల నరసింహారెడ్డి, గందె వెంకటేశ్వర్లు, బీఆర్ఎస్ 17వ వార్డ్ నాయకులు చట్ల వెంకటేశ్వర్లు, తోట రవీందర్, మహమ్మద్ అల్తాఫ్, తదితరులు ఉన్నారు.
