Vote | సర్పంచ్ గా ఆదరించండి..
- గొల్లపల్లి సర్పంచ్ అభ్యర్థి ఒరగంట మమత విష్ణు తేజ్
Vote | గొల్లపల్లి, ఆంధ్రప్రభ : గొల్లపల్లి పట్టణ సర్పంచ్ స్థానానికి పోటీపడుతున్న ఓరగంటి మమత విష్ణుతేష్ ముమ్మర ప్రచారం నిర్వహిస్తున్నారు. బీసీ నినాదంతో ముందుకు వెళ్తున్న మమతకు గ్రామ ప్రజలు బ్రహ్మరథం పడుతున్నారు. గొల్లపల్లిలో ఎక్కడ చూసినా మమత పేరే సర్పంచ్ గా వినిపిస్తుంది. బీసీల కోసం బీసీ నాయకుడు ఓరుగంటి భార్గవ్ రామ్ అనేక ఉద్యమాలు చేశాడు. గతంలో సర్పంచ్ గా పనిచేసిన భార్గవరాంకు గ్రామస్తులతో మంచి సంబంధాలున్నాయి. దాంతో అన్ని వర్గాల ప్రజలు మమతకు ఓటు వేసి గెలిపించాలని నిశ్చయం చేయించుకున్నారు.

