కొనసాగుతున్న బంద్
తెరుచుకోని వ్యాపార సముదాయాలు, విద్యాసంస్థలు
మహబూబ్ నగర్, అక్టోబర్ (ఆంధ్రప్రభ) : బీసీలకు 42% రిజర్వేషన్లు (BC Reservations) కేటాయించాలని డిమాండ్ చేస్తూ శనివారం బీసీ జేఏసీ తలపెట్టిన బంద్ పాలమూరు జిల్లా వ్యాప్తంగా శాంతియుతంగా కొనసాగుతుంది. జిల్లా కేంద్రంలో అన్ని వ్యాపార సముదాయాలు, విద్యాసంస్థలు స్వచ్ఛందంగా మూతపడ్డాయి. మహబూబ్ నగర్ ఆర్టీసీ రీజినల్ కార్యాలయ పరిధిలోని 800 ఆర్టీసీ బస్సులు డిపోలకే పరిమితమయ్యాయి.
ఉదయం 5 గంటలకే బీఆర్ఎస్, కాంగ్రెస్, బీజేపీ (BJP) నేతలు అంతా డిపో ఎదుట బైఠాయించారు. ఆర్టీసీ బస్సులు బయటకు వెళ్లకుండా అడ్డుకునే ప్రయత్నం చేశారు. బస్సులన్నీ ఎక్కడికక్కడ నిలిచిపోవడంతో రోడ్లన్ని నిర్మానుష్యంగా మారాయి. బంద్ లో భాగంగా ఎలాంటి హింసాత్మక ఘటనలు చోటుచేసుకోకుండా అన్ని డిపోల వద్ద పోలీసులు గట్టి బందోబస్తు నిర్వహిస్తున్నారు. ప్ప్రైవేట్ వాద్యా సంస్థలు ముందుగానే సెలవులు ప్రకటించాయి.

