Vissannapet | కిడ్నీ బాధితుడికి చేయూత

Vissannapet | కిడ్నీ బాధితుడికి చేయూత

  • కేశినేని ట్రస్టు ద్వారా సహాయ కిట్టు పంపిణీ

Vissannapet | విస్సన్నపేట, ఆంధ్రప్రభ : మండలంలోని తాతకుంట్ల గ్రామంలో కిడ్నీ వ్యాధితో బాధపడుతున్న పేరబత్తుల మల్లాది సూర్యనారాయణరావుకు కిడ్నీ చికిత్సకు అవసరమైన సహాయ కిట్టును తెలుగుదేశం పార్టీ నాయకులు సోమవారం అందజేశారు. తాతకుంట్ల గ్రామంలోని తెల్లదేవరపల్లి సొసైటీ అధ్యక్షుడు వీరమాచనేని కృష్ణప్రసాద్ నివాసం వద్ద కేశినేని ఫౌండేషన్ ఆధ్వర్యంలో అందిస్తున్న కిట్లను నాయకులు అందజేశారు.

తెలుగుదేశం పార్టీ తాతకుంట్ల గ్రామ అధ్యక్షుడు పులపాక శ్రీనివాసరావు కూటమి నాయకుడు పులపాక బాబు, భారతీయ జనతా పార్టీ రాష్ట్ర ఎస్సీ మోర్చా కార్యవర్గ సభ్యుడు మేడ రాజశేఖర్, తాతకుంట్ల గ్రామ ఉపాధ్యక్షుడు పుల్లయ్య, కావిటి శ్రీనివాసరావు, గద్దల రవి, పేరబత్తుల హరిజనవాడ వార్డు సభ్యులు రూబెన్, తిరుపతిరావు తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply