Visits | శ్రీ కనకదుర్గను దర్శించుకున్న ఎమ్మెల్యే వేముల
- ఎమ్మెల్యే వేముల వీరేశంకు స్వాగతం పలికిన ఆలయ చైర్మన్ మారగోని
Visits | చిట్యాల, ఆంధ్రప్రభ : వైకుంఠ ఏకాదశి సందర్భంగా చిట్యాలలోని కనకదుర్గ అమ్మవారిని నకిరేకల్ ఎమ్మెల్యే వేముల వీరేశం ఇవాళ దర్శించుకున్నారు. ప్రత్యేక పూజలు నిర్వహించారు. అమ్మవారి ఆశీస్సులు ప్రజలందరిపై ఉండాలని ఆయన ఆకాంక్షించారు. అసెంబ్లీ సమావేశాల్లో పాల్గొని హైదరాబాద్ నుండి నకిరేకల్ కు వెళ్తున్న ఎమ్మెల్యేకు ముందుగా గుడి చైర్మన్ మారగోని ఆంజనేయులు గౌడ్ స్వాగతం పలికి సత్కరించారు. ఈ కార్యక్రమంలో మునిసిపల్ మాజీ చైర్మన్ కోమటిరెడ్డి, పెద్ద కాపర్తి గ్రామ సర్పంచ్ కాటం వెంకటేశం, ఆలయ డైరెక్టర్లు గంజి వెంకటేశం, రుద్రారపు లింగస్వామి, అర్చకులు దుర్గేష్ శర్మ ప్రజా ప్రతినిధులు పాల్గొన్నారు.


