Visakha – క‌త్తితో ప్రేమోన్మాది దాడి … త‌ల్లి మృతి, కుమార్తెకు సీరియ‌స్ ..

విశాఖపట్నం మధురవాడలో ఈ మధ్యాహ్నం ప్రేమోన్మాది ఘాతుకానికి పాల్పడ్డాడు. ఇక్కడి స్వయంకృషి నగర్ లో ప్రేమోన్మాది తల్లీకూతురుపై కత్తి దాడికి పాల్పడ్డాడు. ఈ ఘటనలో ఒక మహిళ మృతి చెందగా, ఆమె కుమార్తె తీవ్రంగా గాయపడింది. మధురవాడ పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగిన ఈ సంఘటన స్థానికంగా కలకలం రేపింది.
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం, నవీన్ డిగ్రీ చదువుతున్న దీపిక ఇంటికి వెళ్లి ఆమెపై కత్తితో దాడి చేశాడు. అడ్డుకోబోయిన దీపిక తల్లి లక్ష్మి (43)ని కూడా నవీన్ కత్తితో పొడవడంతో ఆమె అక్కడికక్కడే మృతి చెందింది. తీవ్రంగా గాయపడిన దీపికను స్థానికులు వెంటనే ఆసుపత్రికి తరలించారు. ఆమె పరిస్థితి విషమంగా ఉన్నట్లు వైద్యులు తెలిపారు.

ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు నిందితుడు నవీన్ కోసం గాలిస్తున్నారు. కాగా నిందితుడు నవీన్ ను పోలీసులు శ్రీకాకుళం జిల్లాలో అరెస్ట్ చేశారు.. దీనిపై విశాఖ సీపీ శంఖబ్రత బాగ్చి మీడియాతో మాట్లాడుతూ, నవీన్,దీపిక లవ్ వ్యవహారం వారి బంధువులకు తెలసన్నారు.. వారికి వివాహం చేయాలని కూడా నిశ్చయించారన్నారు.. అయితే నవీన్ ప్రవర్తనలో మార్పు రావడంతో దీపిక తల్లిదండ్రులు ఈ వివాహ ప్రయత్నాలను రద్దు చేసినట్లు చెప్పారు.. దీంతో నేడే నవీన్ కత్తితో దీపికపై దాడి చేశాడని అన్నారు. కుమార్తెను రక్షించేందుకు అడ్డు వచ్చిన తల్లిపై కూడా కత్తితో విచాక్షణా రహితంగా దాడి చేయడంతో ఆమె సంఘటనా స్థలంలో మరణించిందన్నారు.. దీపిక ప్రస్తుతం హస్పటల్లో కోలుకుంటున్నదని పేర్కొన్నారు..

మధురవాడలో జరిగిన ఈ ప్రేమోన్మాది దాడి ఘటనపై హోంమంత్రి అనిత తీవ్రంగా స్పందించారు. విశాఖ సీపీ శంఖబ్రత బాగ్చితో ఫోన్లో మాట్లాడి వివరాలు తెలుసుకున్నారు. యువతి తల్లి మృతిపై దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. బాధితురాలు దీపికకు మెరుగైన వైద్యం అందించాలని ఆదేశించారు. ప్రేమోన్మాదిని త్వరగా పట్టుకుని కఠినంగా శిక్షించాలని ఆదేశించారు. దీనిపై చంద్రబాబు సైతం స్పందించారు.. ఘటన వివరాలను అడిగి తెలుసుకున్నారు.. బాధిత యువతికి మెరుగైన వైద్య సాయం అందించాలని ఆదేశించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *