భారత స్టార్ క్రికెటర్ విరాట్ కోహ్లీ ఢిల్లీ చేరుకున్నారు. ఈ నెల 19 నుంచి ఆస్ట్రేలియాతో జరగనున్న మూడు మ్యాచ్‌ల వన్డే సిరీస్ కోసం శుభ్‌మన్ గిల్ నేతృత్వంలోని జట్టు బుధవారం ఆస్ట్రేలియాకు బయలుదేరనుంది.
ఈ నేపథ్యంలో కుటుంబంతో కలిసి లండన్‌లో ఉన్న విరాట్ కోహ్లీ.. భారత్‌కు తిరిగి వచ్చారు. ఈ క్రమంలో ఢిల్లీ విమానాశ్రయంలోని మీడియా కంటికి చిక్కిన విరాట్… స్టైలిష్ లుక్‌తో రిలాక్స్‌గా కనిపించాడు. దీంతో విరాట్ లుక్స్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారయి..
అయితే, దాదాపు 15 నెలలుగా అంతర్జాతీయ క్రికెట్‌కు దూరంగా ఉన్న కోహ్లీ లండన్‌లో కోచ్ నయీమ్ అమీన్ మార్గదర్శకత్వంలో ప్రాక్టీస్ చేస్తూ తన ఫిట్‌నెస్, బ్యాటింగ్ టెక్నిక్‌పై కసరత్తు చేశారు. చివరిసారిగా IPL 2025లో ఆడిన విరాట్ కోహ్లీ ఆర్‌సీబీ (RCB) జట్టును మొదటిసారి టైటిల్ విజేతగా నిలిపి మరుసటి రోజు లండన్‌కు వెళ్లారు.
మరోవైపు హిట్ మ్యాన్ రోహిత్ శర్మ కూడా ముంబైలో మాజీ ఆటగాడు అభిషేక్ నాయర్ పర్యవేక్షణలో ఫిట్‌నెస్ ట్రైనింగ్ తీసుకుంటున్నారు.
ఇక టీమిండియా 19 నుంచి 25 వరకు ఆస్ట్రేలియాతో మూడు వన్డే మ్యాచ్‌లు ఆడనుంది. మొదటి వన్డే పర్త్‌లో, రెండోది మెల్‌బోర్న్‌లో, చివరి మ్యాచ్ సిడ్నీలో జరగనుంది.