అభిమానుల్లో రిటైర్మెంట్ చర్చలు!
టీ20, టెస్ట్ ఫార్మాట్ల నుంచి రిటైర్ అయిన తర్వాత విరాట్ కోహ్లీ క్రికెట్‌కు కొంత దూరంగా ఉన్నాడు. చివరిసారి ఛాంపియన్స్ ట్రోఫీలో ఆడినప్పుడు అభిమానులు మైదానంలో చూశారు. అయితే తాజాగా లండన్‌లో ఒక అభిమానితో దిగిన ఆయన ఫోటో సోషల్ మీడియాలో హల్‌చల్ చేస్తోంది.
స్వెట్‌షర్ట్, నల్ల టోపీ ధరించి పోజ్ ఇస్తున్న కోహ్లీ కొత్త లుక్ అందరి దృష్టిని ఆకర్షించింది. ముఖ్యంగా తెల్లటి గడ్డం తో కనిపించడం అభిమానులను ఆశ్చర్యానికి గురిచేసింది. ఈ ఫోటో చూసి, “ఇప్పుడే అంతర్జాతీయ క్రికెట్‌కు గుడ్‌బై చెప్పబోతున్నారా?” అనే చర్చలు మొదలయ్యాయి.
ఈ ఫోటో చూసిన అభిమానులు భావోద్వేగానికి గురయ్యారు. “తెల్ల గడ్డం, కళ్లలో తగ్గుతున్న జ్వాల… ఇదే మన ప్రస్తుత విరాట్ కోహ్లీ. మనం చూడాలని అనుకోని ముగింపు దగ్గరపడుతోంది!” అని ఒక అభిమాని రాశాడు. మరో అభిమాని వ్యాఖ్యానిస్తూ, “కోహ్లీని మళ్లీ వైట్స్‌లో చూడాలని ఆశించాం… కానీ ఆయన గడ్డమే వైట్ అవుతోంది” అని పేర్కొన్నాడు.
త్వరలోనే మళ్లీ మైదానంలో?
గతేడాది టీ20 వరల్డ్ కప్ గెలిచిన తర్వాత కోహ్లీ, రోహిత్ శర్మ చిన్న ఫార్మాట్‌కు గుడ్‌బై చెప్పారు. అలాగే ఇంగ్లాండ్ సిరీస్‌కు ముందే టెస్ట్ క్రికెట్ నుంచి కూడా రిటైర్ అయ్యారు. ప్రస్తుతం వీరిద్దరూ ODI జట్టులో మాత్రమే ఉన్నారు. అక్టోబర్-నవంబరులో జరిగే ఆస్ట్రేలియా సిరీస్‌లో మళ్లీ యాక్షన్‌లో కనిపించే అవకాశముంది.