Virat Kohli No.1| ఐసీసీ వన్డే ర్యాంకింగ్స్‌లో నంబర్ వన్‌గా విరాట్ కోహ్లీ | రోహిత్ శర్మకు వెనుకబాటు

Virat Kohli No.1| ఐసీసీ వన్డే ర్యాంకింగ్స్‌లో నంబర్ వన్‌గా విరాట్ కోహ్లీ | రోహిత్ శర్మకు వెనుకబాటు
- ఐసీసీ వన్డే ర్యాంకింగ్స్‌లో మళ్లీ నంబర్ నవ్ స్థానానికి విరాట్ కోహ్లీ
రోహిత్ శర్మను వెనక్కి నెట్టిన కింగ్ కోహ్లీ
న్యూజిలాండ్ వన్డేలో అద్భుత ప్రదర్శన
ఐదేళ్ల తర్వాత తిరిగి అగ్రస్థానంలో కోహ్లీ
డారిల్ మిచెల్ రెండో స్థానంలో
కెరీర్‌లో 825 రోజుల పాటు నంబర్ వన్‌గా కోహ్లీ
Kohli | వెబ్‌డెస్క్, ఆంధ్రప్రభ : టీమిండియా స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ వన్డే ర్యాంక్‌లో టాప్‌లేపాడు. ఐసీసీ తాజాగా ప్రకటించిన పురుషుల వన్డే ర్యాంకింగ్స్‌లో అగ్రస్థానాన్ని కైవసం చేసుకున్నాడు. ఇప్పటివరకు నంబర్ వన్ స్థానంలో ఉన్న భారత జట్టు కెప్టెన్ రోహిత్ శర్మను (Rohith Sharma) వెనక్కి నెట్టి కింగ్ కోహ్లీ సింహాసనాన్ని అధిరోహించాడు. రోహిత్ శర్మ మూడో స్థానానికి పడిపోయాడు.

న్యూజిలాండ్‌తో (New zealand) జరిగిన తొలి వన్డేలో 91 బంతుల్లో 93 పరుగులు చేసి జట్టు విజయంలో కీలక పాత్ర పోషించిన ప్రదర్శనతో కోహ్లీకి ఈ అగ్రస్థానం దక్కింది. దాదాపు ఐదేళ్ల తర్వాత, అంటే 2021 జూలై తర్వాత కోహ్లీ తిరిగి నంబర్ వన్ ర్యాంకును అందుకోవడం విశేషం. తన కెరీర్‌లో ఇప్పటివరకు 825 రోజుల పాటు కోహ్లీ నంబర్ వన్ స్థానంలో కొనసాగాడు. అద్భుత ఫామ్‌లో ఉన్న న్యూజిలాండ్ ఆల్‌రౌండర్ డారిల్ మిచెల్, కోహ్లీకి కేవలం ఒక్క పాయింట్ దూరంలో రెండో స్థానంలో నిలిచాడు.

CLICK HERE TO READ టీమిండియాకు షాక్!
Virat Kohli ODI ranking
Virat Kohli number one
ICC ODI rankings latest
Virat Kohli vs Rohit Sharma
Team India cricket news
Virat Kohli New Zealand ODI
King Kohli top ranking
ICC men’s ODI rankings
Indian cricket latest news1
