viral | ఒళ్ళు బలిసిందా…?

viral | ఒళ్ళు బలిసిందా…?
యూజ్ లెస్ ఫెలో…
కండ్లు నెత్తికెక్కినాయా?
దిమాకిట్ల కరాబ్ అయిందా పోలీసోళ్లకు!
అభ్యర్థిని పోలింగ్ కేంద్రం నుంచి బయటకు ఎట్లా పంపుతారు ఏం సంగతి?
పోలీస్ పై మాటలతో విరుచుకుపడ్డ తో ఎంపీ
జిల్లాలో తీవ్ర దుమారం లేపుతున్న ఘటన
ఎంపీ అరవింద్ వ్యాఖ్యలు.. నెట్టింట్లో వైరల్..
viral | నిజామాబాద్ , ఆంధ్రప్రభ : ఒక పోలింగ్ కేంద్రం నుంచి అభ్యర్థిని బయటకు ఎలా పంపుతారు పోలీసోళ్లకు ఒళ్ళు బలిసిందా… దిమా కిట్ల కరాబ్ అయిందా… యూస్ లెస్ ఫెలో అంటూ పోలీసు పై ఎంపీ మాటలతో విరుచుకుపడ్డారు. ఈ ఘటన జిల్లాలో తీవ్ర దుమారం లేపుతుంది. ఇందుకు సంబంధించిన వీడియో నెట్టింట్లో వైరల్ అవుతుంది.
మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో భాగంగా నిజా మాబాద్ నగరంలోని 34వ డివిజన్ హరిచరణ్ మార్వాడి పోలింగ్ కేంద్రం లో అనూహ్య ఘటన చోటుచేసు కుంది. హరి చరణ్ మార్వాడి పోలింగ్ కేంద్రంలో పోలింగ్ కేంద్రం లో అభ్యర్థిని కేంద్రం నుం చి బయటకు పంపు తు న్నారని …అదే విధంగా పోలింగ్ కేంద్రంలో ఒకరి ఓటు మరొకరు వేస్తున్నా రని అభ్యర్థి ఆరోపణ మేర కు సమాచారం తెలు సుకు న్న ఎంపీ ధర్మ పురి అరవిం ద్ హరిచరణ్ మార్వాడి పోలింగ్ కేంద్రానికి బుధవా రం మధ్యాహ్నం చేరుకొని ఎంపీ ధర్మపురి హల్చల్ చేశారు
పోలింగ్ కేంద్రం నుంచి అభ్యర్థిని బయటకు ఎలా పంపుతారు?
పోలింగ్ కేంద్రం నుంచి అభ్యర్థిని బయటకు ఎలా పంపుతారని అక్కడే ఉన్న పోలీస్ తో ఎంపీ మండిపడ్డారు. సాయంత్రం 5 గంటల వరకు ఇక్కడే ఉంటారు అతనినీ పంపి తే ఊరుకోమని ఎంపీ తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు. పోలీసోల్ల చేత కానితనంతోనే ఇలాంటి సంఘటనలు చోటు చేసు కుంటున్నాయని అక్కడే విధులు నిర్వహిస్తున్న పోలీసుతో ఎంపీ అర వింద్ తీరు జిల్లాలో చర్చ నీయాంశమైంది. అక్కడే ఉన్న అభ్యర్థితో ఎంపీ మాట్లాడారు. సాయంత్రం ఐదు గంటల వరకు పోలిం గ్ కేంద్రం నుంచి బయటకు వచ్చేది లేదని సూచిం చాడు. ఒకవేళ నిన్ను ఎవరైనా బయటకు పంపి తే పోలీసోడైనా సరే తన్ను కుంటా తీసుకురా అని ఎంపీ వ్యాఖ్యలు తీవ్ర దుమారం లేపాయి.
నీకు ఎంత ధైర్యం ఉంటే అభ్యర్థిని బయటకు పంపుతావ్
పోలింగ్ కేంద్రంలో విధులు నిర్వర్తిస్తున్న ఉద్యోగితో ఎంపీ తీరు
అభ్యర్థితో పాటు ఎంపీ పోలింగ్ కేంద్రంలో లోపలి కి వెళ్లి విధులు నిర్వర్తి స్తున్న ఉద్యోగితో ఎంపీ మాట్లాడారు .. నీకు ఎంత ధైర్యం ఉంటే… అభ్యర్థిని బయటకు పంపుతావు సదరు ఉద్యోగిని ప్రశ్నిం చారు. ఇక్కడ తప్పు జరుగుతుందని అభ్యర్థి మీకు కంప్లైంట్ చేస్తే మీరు ఏం చేస్తున్నారు. సరి చేయాల్సిన బాధ్యత మీది కాదా. అని ఎంపీ సదరు ఉద్యోగిని ప్రశ్నించారు. ప్రతి ఒక్కరి ముఖం చూ యించాకే ఓటు వేయిం చాలని అక్కడే విధులు నిర్వహిస్తున్న ఉద్యోగు ల లకు ఎంపీ గట్టిగా చెప్పారు..
నెట్టింట్లో వైరల్ అవుతున్న వీడియో_
నిజామాబాద్ నగరంలోని పోలింగ్ కేంద్రంలో పోలీస్ తో అక్కడే విధులు నిర్వ హిస్తున్న సదరు ఉ ద్యోగు లతో ఎంపీ తీరుపై పూర్తి వీడియో నెట్టింట్లో వైరల్ అవుతుంది. పోలీస్ పై మాటలతో విరుచుకుపడ్డ ఎంపీ తీరు కూడా జిల్లాలో చర్చనీయాంశం అవుతుంది.


