Peddapally | నిబంధనలు ఉల్లంఘిస్తే జరిమానాలే : ట్రాఫిక్ ఏసీపీ శ్రీనివాస్

పెద్దపల్లి, ఆంధ్రప్రభ : నిబంధనలు ఉల్లంఘించి ట్రాఫిక్ ఇబ్బందులు కలిగిస్తే జరిమానాలు తప్పవని ట్రాఫిక్ ఏసీపీ శ్రీనివాస్ (Traffic ACP Srinivas) తెలియజేశారు. సోమవారం జిల్లా కేంద్రంలో సీఐ అనిల్ (CI Anil) తో కలిసి రోడ్లపై వాహనాలు నిలపొద్దని వాహనదారులకు సూచించారు. అనంతరం మాట్లాడుతూ… ద్విచక్ర వాహనదారులు రోడ్లపై వాహనాలు నిలపొద్దని, చిరు వ్యాపారులు ట్రాఫిక్ కు ఇబ్బందులు కలిగించొద్దని కోరారు.

పండ్లు, వస్త్ర, చిరు వ్యాపారాలు రోడ్డుపై వరకు రావడం వల్ల వాహనదారులు ఇబ్బందులు పడుతున్నారన్నారు. ఇకపై తరచూ తనిఖీలు నిర్వహిస్తామని, ట్రాఫిక్ కు ఇబ్బంది కలిగిస్తే జరిమానాల (fines)తో పాటు కేసులు నమోదు చేస్తామన్నారు. వాహనదారులు ఎట్టి పరిస్థితుల్లో మద్యం సేవించి వాహనాలు నడపవద్దని, ప్రతినిత్యం డ్రంక్ అండ్ డ్రైవ్ (Drunk and drive) పరీక్షలు నిర్వహిస్తున్నామన్నారు. తనిఖీల్లో పట్టుబడిన వారికి జరిమానాలతో పాటు జైలుశిక్ష పడుతుందన్నారు. రాజీవ్ రహదారిపై వాహనాలు నిలిపిన వారిపై కేసులు నమోదు చేస్తున్నామన్నారు.

Leave a Reply