కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులు సర్పంచులుగా గెలిస్తేనే గ్రామాలు అభివృద్ధి…

  • మునుగోడు నియోజకవర్గం పార్టీ ఎన్నికల ఇన్చార్జి పబ్బు రాజు గౌడ్
  • మల్కాపురం లో మస్తాన్ బాబు ఇంటింటి ప్రచారం

చౌటుప్పల్, ఆంధ్రప్రభ : కాంగ్రెస్ పార్టీ బలపరిచిన అభ్యర్థులు సర్పంచులు గా గెలిస్తేనే గ్రామాలు అభివృద్ధి చెందుతాయని మునుగోడు నియోజకవర్గం పార్టీ ఎన్నికల ఇన్చార్జి పబ్బు రాజు గౌడ్ తెలిపారు. చౌటుప్పల్ మండలంలోని దండు మల్కాపురం గ్రామంలో శనివారం కాంగ్రెస్ పార్టీ బలపరిచిన సర్పంచ్ అభ్యర్థి గ్రామ మాజీ ఎంపీటీసీ సభ్యులు ఈడుదుల పాండరి కుమారుడు, గ్రామ నేతాజీ యువజన సంఘం ప్రతినిధి ఈడుదుల మస్తాన్ బాబు తో కలిసి ఆయన ఎన్నికల ప్రచారం నిర్వహించారు.

ఈ సందర్భంగా రాజు గౌడ్ మాట్లాడుతూ…. మల్కాపురం గ్రామ అభివృద్ధి కోసం, ప్రజల సమస్యల పరిష్కారం కోసం ప్రజలకు అందుబాటులో ఉండి సేవ చేసే మస్తాన్ బాబు కు కేటాయించిన కత్తెర గుర్తుపై గ్రామ ప్రజలు, 166 మంది నేతాజీ యువజన సంఘం సభ్యుల కుటుంబాలు పెద్ద ఎత్తున ఓట్లు వేసి సర్పంచ్ గా గెలిపించాలని కోరారు.

మస్తాన్ బాబు ను సర్పంచ్ గా గెలిపిస్తే ప్రభుత్వ పథకాలను ప్రజలకు అందించడంతో పాటు మునుగోడు అభివృద్ధి ప్రదాత ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి సహకారంతో గ్రామంలో చేయబోయే అభివృద్ధి పనులను గ్రామ ప్రజలకు ఇంటింటికి తిరిగి వివరించారు.

కాగా అధికార పార్టీ మద్దతు ఉన్న మస్తాన్ బాబును సర్పంచిగా గెలిపిస్తేనే గ్రామం అభివృద్ధి చెందుతుందని, సమస్యలు పరిష్కారం అవుతాయని గ్రామ ప్రజలు భావిస్తున్నట్లుగా తెలుస్తుంది. ఈ ప్రచార కార్యక్రమంలో మాజీ జెడ్పిటిసి చిలుకూరి ప్రభాకర్ రెడ్డి, శ్రీ ఆందోల్ మైసమ్మ దేవాలయం చైర్మన్ చిలుకూరి మల్లారెడ్డి, మునుకుంట్ల నరసింహ గౌడ్, పలువురు కాంగ్రెస్ నాయకులు, మహిళలు పాల్గొన్నారు.

Leave a Reply