విక్రమ్ సారాభాయ్ పుస్తకంపై సమీక్షా

విక్రమ్ సారాభాయ్ పుస్తకంపై సమీక్షా
భారత అంతరిక్ష విజ్ఞానానికి సారాభాయ్ సేవలు చిరస్మరణీయం
పటమట, ఆంధ్రప్రభ : విజయవాడలోని ఆంధ్ర లయోలా కాలేజీ లో ఫాదర్ గోర్డన్ లైబ్రరీ ఆధ్వర్యంలో నిర్వహించిన లోయోలా రివ్యూయర్స్ అసోసియేషన్ కార్యక్రమంలో ప్రముఖ శాస్త్రవేత్త విక్రమ్ సరేబాయ్ జీవితాన్ని ఆవిష్కరించే పుస్తకంపై సమీక్ష నిర్వహించారు. అందరూ ఆకాశంలో నక్షత్రాలను చూస్తే, సారాభాయ్ భారతదేశ భవిష్యత్తును చూశారు అంటూ నిర్వహించినఈ కార్యక్రమంలో ప్రముఖ రచయిత మరిట అమృత షా రచించిన “విక్రమ్ సారాభాయ్” పుస్తకాన్ని చర్చించారు.
భారత అంతరిక్ష కార్యక్రమానికి పునాది వేసిన సారాభాయ్ దూరదృష్టి, శాస్త్రీయ దృక్పథం, దేశాభివృద్ధికి చేసిన సేవలను పుస్తకం విపులంగా ప్రతిబింబిస్తుందని వక్తలు పేర్కొన్నారు. కె. సురేష్ కుమార్ మాట్లాడుతూ భారతదేశం అంతరిక్ష రంగంలో ప్రపంచ దేశాలకు పోటీగా ఎదగడానికి విక్రమ్ సారాభాయ్ చేసిన కృషి అపారమని అన్నారు. చంద్రయాన్, మంగళయాన్ వంటి విజయాలకు ఆయన ఆలోచనలు పునాది అయ్యాయని వివరించారు.
భారత విజ్ఞాన రంగంలో ఆయన చూపిన దిశ దేశ అభివృద్ధికి మార్గదర్శకమైందని చెప్పారు. విద్యార్థుల్లో విజ్ఞానాసక్తిని పెంపొందించడమే ఈ కార్యక్రమం లక్ష్యమని నిర్వాహకులు తెలిపారు. శాస్త్ర సాంకేతిక రంగాలపై ఆసక్తి పెంపొందించేందుకు ఇటువంటి పుస్తక సమీక్షలు ఉపయోగపడతాయని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో డాక్టర్ టీ. శ్రీకుమార్, డాక్టర్ ఎన్.ఏ. ఫిలిప్స్ మెల్విన్, తిమిరాల దీన్ తదితరులు పాల్గొన్నారు. కార్యక్రమానికి లోయోలా రివ్యూయర్స్ అసోసియేషన్ కార్యదర్శి డాక్టర్ జి.ఏ. ప్రసాద్ రావు అధ్యక్షత వహించారు.
