Vikram Misri | కేంద్రానికి దేశ ఇంధన అవసరాలే అత్యంత ప్రాధాన్యం

  • చమురు కొనుగోళ్లపై పశ్చిమ దేశాల నుంచి ఒత్తిడి..
  • స్పందించిన భారత విదేశాంగ కార్యదర్శి

హైదరాబాద్ : రష్యా నుండి ముడి చమురు కొనుగోళ్ల(crude oil purchases)పై పశ్చిమ దేశాల నుంచి ఒత్తిడి పెరుగుతున్న వేళ, భారత విదేశాంగ శాఖ కార్యదర్శి విక్రమ్ మిస్రి (Vikram Misri) మంగళవారం కీలక వ్యాఖ్యలు చేశారు. దేశ ఇంధన అవసరాలే కేంద్ర ప్రభుత్వానికి అత్యంత ప్రాధాన్య అంశం అని ఆయన స్పష్టం చేశారు.

విలేకరుల సమావేశంలో మిస్రి మాట్లాడుతూ, భారత ప్రజలకు ఇంధన భద్రతను కల్పించడానికి అవసరమైన అన్ని చర్యలు తీసుకుంటాం అని తేల్చి చెప్పారు. ఈ సందర్భంలో యూరోపియన్ యూనియన్ (EU) దేశాలు ద్వంద్వ ప్రమాణాలు పాటిస్తున్నాయంటూ తీవ్ర విమర్శలు చేశారు.

EU దేశాల ఈ వైఖరి ప్రపంచ ఇంధన మార్కెట్ పై ప్రతికూల ప్రభావం చూపుతుందని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. ఇతర దేశాల ఉనికితో ముడిపడిన అంశాలపై చర్చించేటప్పుడు సమతూకంగా, స్పష్టమైన విధానంతో ముందుకు సాగాలని మిస్రి నొక్కి చెప్పారు. భారతదేశం తన ప్రజల ఇంధన అవసరాలను తీర్చడానికి కట్టుబడి ఉందని ఆయన ఈ సందర్భంగా పునరుద్ఘాటించారు.

Leave a Reply