26yrs | సంగీత నుంచి విడాకుల పిటిషన్..

26yrs | సంగీత నుంచి విడాకుల పిటిషన్..
26yrs | చెంగల్పట్టు కోర్టులో విడాకుల పిటిషన్?
26 ఏళ్ల దాంపత్యానికి షాకింగ్ మలుపు
సోషల్ మీడియాలో వైరల్ ప్రచారం
వెలువడని అధికారిక ప్రకటన
26yrs | ఆంధ్రప్రభ, వెబ్ డెస్క్ : తమిళ స్టార్ హీరో, టీవీకే అధినేత విజయ్ వ్యక్తిగత జీవితం మళ్లీ సంచలనంగా మారింది. ఆయన భార్య సంగీత చెంగల్పట్టు జిల్లా కోర్టులో విడాకుల కోసం పిటిషన్ దాఖలు చేసినట్లు సమాచారం వెలువడడంతో అభిమానుల్లో ఆశ్చర్యం, ఆందోళన నెలకొంది.
దాదాపు 26 ఏళ్ల బలమైన వైవాహిక బంధం అనంతరం విడాకులు కోరడం సినీ వర్గాల్లో హాట్ టాపిక్గా మారింది. 1999లో వివాహం చేసుకున్న విజయ్–సంగీత దంపతులు ఎన్నో మధుర జ్ఞాపకాలు, కుటుంబ విలువలతో ఆదర్శ దంపతులుగా గుర్తింపు పొందారు. వీరికి ఒక కుమారుడు, ఒక కుమార్తె ఉన్నారు.

అయితే గత కొంతకాలంగా వీరిద్దరి మధ్య విభేదాలు ఉన్నాయన్న ప్రచారం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ వార్తలతో అభిమానుల్లో కలత, నిరాశ వ్యక్తమవుతోంది. కొన్ని వర్గాల్లో వినిపిస్తున్న ఇతర ఆరోపణలు పరిస్థితిని మరింత సంక్లిష్టం చేస్తున్నాయి.
ఇప్పటివరకు కుటుంబ సభ్యుల నుంచి గానీ, విజయ్ లేదా సంగీతల నుంచి గానీ ఎలాంటి అధికారిక ప్రకటన వెలువడలేదు. దీంతో ఈ అంశం చుట్టూ అనేక అనుమానాలు చక్కర్లు కొడుతున్నాయి.
అభిమానులు మాత్రం ఈ వివాదం త్వరగా సానుకూల పరిష్కారం దిశగా వెళ్లాలని, కుటుంబం మళ్లీ శాంతి, సౌఖ్యం వైపు అడుగులు వేయాలని ఆశిస్తున్నారు. ఈ అంశంపై మరిన్ని వివరాలు వెలుగులోకి రావాల్సి ఉంది.
