Vijayawada | అన్నదానానికి లక్ష రూపాయల విరాళం..

Vijayawada | అన్నదానానికి లక్ష రూపాయల విరాళం..

Vijayawada, ఇంద్రకీలాద్రి, ఆంధ్రప్రభ : విజయవాడ ఇంద్రకీలాద్రి పై ఉన్న శ్రీ దుర్గా మల్లేశ్వర స్వామి వార్ల దేవస్థానంలో నిత్యం నిర్వహించే అన్నదాన కార్యక్రమానికి బుధవారం సింగపూర్ నివాసులైన విపిన్ కుమార్ కుటుంబ సభ్యులు రూ. 1,00,000/- (ఒక లక్ష రూపాయలు) విరాళంగా అందజేశారు. వీరు తమ విరాళాన్ని ఆలయ అధికారులకు స్వయంగా అప్పగించారు. వీరికి ఆలయ అధికారులు అమ్మవారి దర్శనం ఏర్పాట్లు చేయగా వేద ఆశీర్వచనం అనంతరం సూపర్నెంట్ డివివి సత్యనారాయణ అమ్మవారి చిత్రపటం ప్రసాదాలు రసీదును అందజేశారు.

Leave a Reply