Vijayawada | అజిత్ సింగ్ నగర్‌లో రోడ్డు ప్రమాదం

Vijayawada | అజిత్ సింగ్ నగర్‌లో రోడ్డు ప్రమాదం

  • అతివేగంగా బైక్ నడిపిన బాలుడు
  • మ‌రో బైక్‌ను ఢీకొట్ట‌డంతో ఇద్దరికి తీవ్ర గాయాలు
  • స్తంభించిన ట్రాఫిక్, స్పందించిన ట్రాఫిక్ పోలీసులు

Vijayawada | పాయికాపురం, ఆంధ్రప్రభ : విజయవాడ నగరంలోని అజిత్ సింగ్ నగర్, అమెరికన్ హాస్పిటల్ ప్రాంతంలో ఈ రోజు ఉదయం రోడ్డు ప్రమాదం జరిగింది. ఓ బాలుడు బైక్‌ను అతివేగంగా నడుపుతూ మలుపు తిరుగుతున్న మరో బైక్‌ను ఢీకొట్టాడు. ఈ ప్రమాదంలో అదుపు తప్పి ఎదురుగా వస్తున్న ఆటో అద్దంపై పడటంతో అది పగిలి ముందు భాగం తీవ్రంగా దెబ్బతింది.

Vijayawada

ఈ ఘటనలో బైక్ నడుపుతున్న బాలుడికి తీవ్ర గాయాలు కాగా, ఢీకొట్టబడిన మరో బైక్‌పై వెళ్తున్న వ్యక్తికీ బలమైన గాయాలయ్యాయి. గాయపడిన వారిని స్థానికులు వెంటనే సమీపంలోని ఆసుపత్రికి తరలించారు. ప్రమాదం కారణంగా ఆ ప్రాంతంలో ట్రాఫిక్ స్తంభించడంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. సమాచారం అందుకున్న వెంటనే ట్రాఫిక్ పోలీసులు ఘటన స్థలానికి చేరుకుని ట్రాఫిక్‌ను నియంత్రించి వాహనాల రాకపోకలను సవ్యంగా సాగేలా చేశారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

Leave a Reply