Vijayawada | ఇంద్రకీలాద్రిపై శాస్త్రోక్తంగా సూర్యోపాసన సేవ

Vijayawada | ఇంద్రకీలాద్రిపై శాస్త్రోక్తంగా సూర్యోపాసన సేవ
లోక కళ్యాణం కోసం ప్రత్యేక క్రతువు
Vijayawada | ఇంద్రకీలాద్రి ఆంధ్రప్రభ : విజయవాడ ఇంద్రకీలాద్రిపై వెలసిన శ్రీ దుర్గా మల్లేశ్వర స్వామి వార్ల దేవస్థానంలో ఆదివారం సూర్యోపాసన పూజలు అత్యంత వైభవంగా నిర్వహించారు. ఇటీవల జరిగిన రథసప్తమి వేడుకలకు కొనసాగింపుగా, అలాగే ఆదివారం కావడంతో ఈ ప్రత్యేక పూజలను ఆలయ ప్రాంగణంలో భక్తిశ్రద్ధలతో జరిపారు. ఆలయ వైదిక కమిటీ ఆధ్వర్యంలో వేద పండితులు సూర్యోపాసన పూజలను శాస్త్రోక్తంగా నిర్వహించారు. లోక కళ్యాణం కోసం, భక్తుల ఆరోగ్య ప్రాప్తి కోసం వేద మంత్రోచ్ఛారణల నడుమ సూర్య భగవానుడికి ప్రత్యేక అర్చనలు, నమస్కారాలు సమర్పించారు. రథసప్తమి అనంతరం వచ్చే ఆదివారాల్లో సూర్యోపాసన చేయడం వల్ల ఆయురారోగ్యాలు, సుఖసంపదలు కలుగుతాయని వేద పండితులు తెలిపారు.
