Vijayasai Reddy | డిజిటల్ ప్లాట్‌ఫామ్ ఏర్పాటుకు.. ప్లాన్

Vijayasai Reddy | డిజిటల్ ప్లాట్‌ఫామ్ ఏర్పాటుకు.. ప్లాన్

Vijayasai Reddy | ఆంధ్రప్రభ, వెబ్ డెస్క్ : మాజీ ఎంపీ విజయసాయిరెడ్డి రాజకీయాలకు గుడ్‌బై చెప్పిన తర్వాత మీడియా రంగంలోకి అడుగుపెట్టనున్నట్లు ప్రకటించారు. డిజిటల్ న్యూస్ ప్లాట్‌ఫామ్‌తో ప్రారంభించి, తరువాత శాటిలైట్ న్యూస్ ఛానెల్ ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు.

రాజకీయాల నుంచి పూర్తిగా తప్పుకున్న మాజీ ఎంపీ విజయసాయిరెడ్డి మీడియా రంగంలోకి ప్రవేశించనున్నట్లు వెల్లడించారు. ఈ విషయాన్ని ఎక్స్ (ట్విట్టర్) వేదికగా పంచుకుంటూ తన భవిష్యత్ ప్రణాళికలను వివరించారు.

మొదటగా తెలుగు, ఇంగ్లిష్, హిందీ భాషల్లో డిజిటల్ న్యూస్ ప్లాట్‌ఫామ్‌ను ప్రారంభించనున్నట్లు తెలిపారు. ఈ వేదిక విజయవంతమైన తర్వాత అదే లక్ష్యాలతో తెలుగులో శాటిలైట్ న్యూస్ ఛానెల్‌ను కూడా ఏర్పాటు చేయనున్నట్లు పేర్కొన్నారు. తాము ప్రారంభించబోయే మీడియా సంస్థ పూర్తిగా నిష్పక్షపాతంగా, వాస్తవాలకు కట్టుబడి ఉంటుందని విజయసాయిరెడ్డి హామీ ఇచ్చారు. ఏ రాజకీయ పార్టీకి అనుబంధంగా కాకుండా స్వతంత్రంగా పనిచేస్తుందని స్పష్టం చేశారు. సామాన్యులు, మహిళలు, యువత, రైతులు, కార్మికులు, అణగారిన వర్గాల సమస్యలను వెలుగులోకి తీసుకురావడమే తమ ప్రధాన లక్ష్యమని తెలిపారు.

Leave a Reply